Just In
- 52 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 3 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దయచేసి నన్ను బ్యాన్ చేయండి: దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కంగనా
'జడ్జిమెంటల్ హై క్యా' మూవీకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంటులో... హీరోయిన్ కంగనా రనౌత్ ఓ జర్నలిస్టుతో గొడవ పడటం, ఆమె తీరుపై మీడియా వారంతా ఆందోళనకు దిగడం తెలిసిందే. వెంటనే కంగనాతో పాటు చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే సినిమా కవరేజ్ బహిష్కరిస్తామని ఫిల్మ్ జర్నలిస్టులు హెచ్చరించారు. దీనిపై ఏక్తా కపూర్ క్షమాపణలు కోరినప్పటికీ... కంగనా మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా కంగనా... తనపై ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను ఉద్దేశించి సంచలన వీడియో విడుదల చేశారు.

మీడియా నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది
ఈ రోజు నేను ఇండియన్ మీడియా గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రతి చోట మంచి వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. నా కెరీర్ మొదటి నుంచి మీడియా నాకు ఎంతో సపోర్ట్ చేసింది. నాకు మీడియాలో చాలా మంచి మిత్రులు ఉన్నారు. వారు నేను ఈ స్థాయికి రావడంలో కీలక పాత్ర పోషించారు.

ఇలాంటి వారు దేశానికి ముప్పు
కానీ కొందరు మీడియా వారు... మన దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ దేశ గౌరవాన్ని, ఐక్యతను, సమగ్రతను దెబ్బతీసే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. వారి సిద్ధాంతాలను జనంపై రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. మన రాజ్యాంగంలో వారిని అడ్డుకోవడానికి ఎటువంటి నిబంధన లేవు, ‘ఉదారవాదులు' అని పిలవబడే వీరిని నేను ఈ దేశానికి ముప్పుగా భావిస్తున్నాను. ఒక జర్నలిస్టును నేను ఢిల్లీలో కలిశాను. చాలా సీరియస్‌గా ప్లాస్టిక్ బ్యాన్, జంతు హింసకు వ్యతిరేకంగా నేను కాంపెయిన్ చేస్తుంటే ఇతడు నాపై జోకులు వేస్తూ ఆర్టికల్ రాశాడు.

వీరు ఉచితంగా తిండి దొరుకుతుందనే ప్రెస్ మీట్లకు వస్తారు
కొందరికి మీడియా సమావేశంలో ఎలా వాదించాలో కూడా తెలియదు. ప్రెస్ మీట్లలో అనవసర విషయాలు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లు అరుస్తారు. వీరంతా ప్రెస్ మీట్లకు వచ్చేది ఉచితంగా తిండి దొరుకుతుందని మాత్రమే. నేను ఒక ఆర్టిస్టును అని చెప్పుకోవడానికి కొన్ని సినిమాలు చూపిస్తా... మీరు రాసిన ఒక్క ఆర్టికల్ చూపించండి. అవేవీ లేనపుడు మీరు జర్నలిస్టులం అని ఎలా చెప్పుకుంటారు? అతడు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి ఎందుకు నిరాకరించాను అంటే దేశ వ్యతిరేక వాదులకు నేను సమాధానం చెప్పను కాబట్టే... అని కంగనా స్పస్టం చేశారు.

మీకు నా కెరీర్ నాశనం చేసేంత సీన్ లేదు
ఈ ముగుర్గురు నలుగురు కలిసి నాపై వ్యతిరేకంగా ఒక గ్రూపు క్రియేట్ చేశారు. రెండు రోజుల క్రితం ఏర్పడిన వీరి గ్రూపుకు ఒక గుర్తింపు కూడా లేదు. మీరు నన్ను బ్యాన్ చేస్తారని బెదిరిస్తున్నారా? నా కెరీర్‌ను నాశనం చేస్తారా? (నవ్వుతూ).. మిమ్మల్ని కొనడానికి లక్షల రూపాయలు అవసరం లేదు. రూ. 50-60 రూపాయలకు కూడా కక్కుర్తి పడతారు. అలాంటి మీరు నన్ను నాశనం చేస్తారా?.. అంటూ కంగనా ఫైర్ అయ్యారు.

దయచేసి నన్ను బ్యాన్ చేయండి
నకిలీ జర్నలిస్టులంతా కలిసి మాఫియాగా ఏర్పడ్డారు...నన్ను సినిమాల్లోకి తీసుకోనివ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీ వల్ల నేను ఈ దేశంలోనే టాప్ నటిగా, హయ్యెస్ట్ పేయిడ్ ఆర్టిస్టుగా ఎదగలేదు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. దయచేసి నన్ను బ్యాన్ చేయండి. నా గురించి వార్తలు రాయడం వల్ల మీ కుటుంబాన్ని పోషించుకోవద్దు... అంటూ కంగనా కౌంటర్ ఇచ్చారు.