»   » పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేయండి: మహిళా నిర్మాత ట్వీట్

పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేయండి: మహిళా నిర్మాత ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'పంజా' సినిమా నిర్మించిన నీలిమా తిరుమలశెట్టి తాజాగా ట్విట్టర్లో చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ సహాయం కోరుతూ ఆమె ట్వీట్ చేశారు. అయితే ఎలాంటి? హెల్ప్ కావాలి? ఎందుకు ఆమె ఈ ట్వీట్ చేశారు? అనేది తెలియడం లేదు.

పవన్ కళ్యాణ్‌తో 'పంజా' చిత్రం నిర్మించిన నీలిమ ఈ సినిమా ద్వారా నష్టాలు చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత 'అలియాస్ జానకి' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 2013లో వచ్చిన ఈ సినిమా కూడా ఆడక పోవడంతో నీలిమ మళ్లీ సినిమాలు తీయలేదు.

ఇన్నాళ్లకు మళ్లీ?

ఇన్నాళ్లకు మళ్లీ?

సినిమాలు లేకపోవడంతో నీలిమ తిరుమలశెట్టి కూడా వార్తల్లో లేకుండా పోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె పవన్ కళ్యాణ్ హెల్ప్ కోరుతూ ట్వీట్ చేసి వార్తల్లో వ్యక్తిగా మారారు. ‘ ప్లీస్ హెల్ మి పవన్ కళ్యాణ్ గారు' అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా?

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా?

ఆర్థికంగా నష్టపోవడంతో నీలిమ తిరుమలశెట్టి 2013 తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. తనకు ఓ సినిమా చేసే అవకాశం ఇవ్వాలని ఆమె ఈ ట్వీట్ చేశారా? లేక మరేదైనా కారణంతో చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

ట్వీట్ డిలీట్

ట్వీట్ డిలీట్

సెప్టెంబర్ 4వ తేదీన ఆమె ఈ ట్వీట్ చేశారు. అయితే ఇపుడు ఆ ట్వీట్ ఆమె ట్విట్టర్ అకౌంట్లో కనిపించడం లేదు. విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో వెంటనే ఆట్వీట్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

పవన్ స్పందించారా?

పవన్ స్పందించారా?

ఆమె ట్వీట్ డిలీట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్.... ఆమె విన్నపంపై స్పందించినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న వారిని, అభిమానులను, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటలారనే విషయం తెలిసిందే.

English summary
Producer Neelima took to Twitter and tweeted, “Please help me PawanKalyan garu”. Within no time, Neelima’s tweet went viral among Pawan’s fans and made them panic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu