»   » చూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి ప్లీజ్ అంటున్న కె.రాఘవేంద్రరావు

చూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి ప్లీజ్ అంటున్న కె.రాఘవేంద్రరావు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కె.రాఘవేంద్రరావు తాజాగా ట్విట్టర్ లోకి వచ్చి మెసేజ్ లు రాస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన కుమారుడు డైరక్ట్ చేసిన అనగనగా ఓ ధీరుడు చిత్రం గురించి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయన ఈ విషయమై ట్వీట్ చేస్తూ..నేను నిన్న అనగనగా ఓ ధీరుడు ట్రైలర్ చూసాను. అందరూ బాగా స్పందించినందుకు చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా దయచేసి యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ చూసి నాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి అన్నారు. ఇక ఆయన తాజాగా షిర్డీ సాయిబాబాపై ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఆయన ట్విట్టర్ లో తెలిపారు.ఇక కొద్ది కాలం క్రితం ఆయన తనకు ఇంటర్నెట్,ట్విట్టర్ వంటివి తెలియదని, వాటిని తన ఫ్యామిలీ మెంబర్సే చూస్తారని అన్నారు. అయితే గత కొద్ది నెలలుగా ఆయన ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం, మిగతా ట్విట్టర్ మెసేజ్ లు పరిశీలించటం వంటివి చేస్తున్నారు. దాంతో ఆయన కూడా ట్విట్టర్ లోకి వచ్చేసారు. ఇక ఆ ట్రైలర్ చూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వదలుచుకుంటే...ఆయన ట్విట్టర్ ఐడి...http://twitter.com/Ragavendraraoba

.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu