»   » ‘చో’ కూడా లోకాన్ని వీడారు, ప్రధాని మోడీ వరుస ట్వీట్లు.... జయ, రమ్యకృష్ణతో లింక్!

‘చో’ కూడా లోకాన్ని వీడారు, ప్రధాని మోడీ వరుస ట్వీట్లు.... జయ, రమ్యకృష్ణతో లింక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సినీ ప్రముఖుడు, నటుడు, రచయిత చో రామ స్వామి(82) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఛో బుధవారం తెల్లవారు ఝామున 4.30 కన్నుమూసారు. జయలలిత చికిత్స పొందిన అపోలో ఆసుపత్రిలోనే చో రామస్వామి కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు.

తమిళనాడుకు చెందిన చో రామస్వామి బహుహుఖప్రజ్ఞాశాలి. తమిళ సినిమాల్లో కమెడియన్ గా ప్రస్తానం ప్రారంభించిన ఆయన ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయితగా ఎదిగారు. అంతే కాదు పొలిటికల్ సెటైరిస్ట్ గా ఆయనకు మంచి పేరుంది.

మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరు మీద 'తుగ్లక్' అనే పత్రికను స్థాపించారు. 1968 లో 'తుగ్లక్' అనే నాటకాన్ని రచించి... దాన్ని కనీసం 2000 సార్లు ప్రదర్శించారు. ఇందిరాగాంధీని విమర్శిస్తూ ఈ నాటకాన్ని రచించారు.

సినిమాల్లో చో

సినిమాల్లో చో

చో రామస్వామి 15 నాటకాలు రాసారు, 89 సినిమాల్లో నటించారు. 5 సినిమాలకు దర్శకత్వం వహించారు. 5 సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు. టీవీ రంగంలో కూడా తన సేవలు అందించారు.

జయతో అనుబంధం

జయతో అనుబంధం

జయలలితకు అత్యంత సన్నిహితుడుగా, రాజకీయ సలహాదారుగా చో రామస్వామి వ్యవహరించారు. ఎవరి మాట వినని జయలలిత... కేవలం చో మాట మాత్రమే వింటారని అప్పట్లో అంతా చెప్పుకునేవారు. , ప్రముఖ సినీనటి రమ్యకృష్ణకు చో రామస్వామి స్వయానా మేనమామ.

ప్రధాని మోడీ సన్నిహితుడు

ప్రధాని మోదీకి కూడా రామస్వామి మంచి మిత్రుడు. జయకు, మోదీకి సత్సంబంధాలు ఏర్పడటానికి రామస్వామే కారణం.... చో మరణ వార్త విన్న వెంటనే మోడీ వరుస ట్వీట్లతో స్పందించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అత్యంత సన్నిహితుడు అంటూ మోడీ ట్వీట్

చో రామస్వామి తనకు అత్యంత సన్నిహితుడు అంటూ మోడీ ట్వీట్ చేసారు.

వరుస ట్వీట్లతో

ప్రధాని మోడీ చో రామస్వామి గురించి వరస ట్వీట్లు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీన్ని బట్టి మోడీ, చో మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు.

మర్చంట్ ఆఫ్ డెత్

చో రామస్వామి నన్ను మర్చంట్ ఆఫ్ డెత్ గా పరిచయం చేసారు... అంటూ అప్పటి వీడియోను ప్రధాని మోడీ ట్విట్టర్లో పోస్టు చేసారు.

చో రామస్వామితో నేను సరిపోను

చో రామస్వామితో సరితూగే స్థాయి నాకు లేదు అంటూ.... మోడీ ఓ వీడియో పోస్టు చేసారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
"Cho Ramaswamy was a multidimensional personality, towering intellectual, great nationalist & fearless voice who was respected and admired. Above all, Cho Ramaswamy was a dear friend. I have been to his annual readers meeting which were an unprecedented editor reader interface. Cho Ramaswamy was insightful, frank & brilliant. Pained by his demise. Condolences to his family & countless readers of Thuglak." PM Modi tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu