»   » విశ్వనాథ్ అద్భుతమైన దర్శకుడు.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

విశ్వనాథ్ అద్భుతమైన దర్శకుడు.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే విశ్వనాథ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా రంగానికి విశేష సేవలందించిన అద్భుతమైన దర్శకుడు అని విశ్వనాథ్‌ను మోదీ అభినందించారు. భారతీయ సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలందించిన విశ్వనాథ్‌కు దేశంలోనే అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్‌లో ప్రధాని

ఫాల్కే, జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్‌లో స్పందించారు. శ్రీ కే విశ్వనాథ్ అద్భుతమైన దర్శకుడు. దాదా సాహెబ్ అవార్డు అందుకొంటున్న సమయంలో అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఉత్తమ నటీనటులను కూడా..

అలాగే ఈ ఏడాది జాతీయ ఉత్తమ అవార్డులు అందుకొంటున్న సినీ తారలను కూడా ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. తమ సృజనాత్మకతను, సేవలతో సినీ పరిశ్రమ అభివృద్దికి తోడ్పాటు అందించిన నటీనటులకు నా ధన్యవాదాలు అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రపతి అందజేత..

రాష్ట్రపతి అందజేత..

బుధవారం న్యూఢిల్లీలోని విజ్క్షాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ ఉత్తమ నటీనటులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కే విశ్వనాథ్‌కు ఫాల్కే అవార్డును అందజేశారు. 1930లో గుడివాడలో జన్మించిన కే విశ్వనాథ్ తెలుగు సినీ పరిశ్రమకు చరిత్రలో నిలిచిపోయే సినిమాలను అందించారు.

సినీ పరిశ్రమకు విశ్వనాథ్..

సినీ పరిశ్రమకు విశ్వనాథ్..

తన కెరీర్‌లో 20 నంది అవార్డులను, 10 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను, ఓ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకొన్నారు. 1992లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తన సుదీర్గ సినీ ప్రయాణంలో దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం లాంటి ఎన్నో ఉత్తమ చిత్రాలను అందించారు. హిందీలో సర్గమ్, కామ్‌చోర్, సంజోగ్, జాగ్ ఉతా ఇన్సాన్, ఈశ్వర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday described K Viswanath as an "outstanding filmmaker" and congratulated him for winning the Dadasaheb Phalke Award, India's highest award in cinema. The 87-year-old received the honour at the Vigyan Bhavan here from President Pranab Mukherjee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu