హీరో కొడుకు చెవి పట్టి లాగిన ప్రధాని (ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : అంతర్జాతీయ నౌకా దశాల ప్రదర్శన లో చోటు చేసుకున్న సంఘటన తండ్రిగా అక్షయ్ కుమార్ ని చాలా ఆనందపడేలా చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సరదాగా అక్షయ్ కుమారుడు ఆర్నవ్ చెవి పట్టుకుని మంచి కుర్రాడు అన్నారు. ఈ విషయం అక్షయ్ కుమార్ తన ట్వీట్టర్ లో తెలియచేసారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... వైజాగ్ లో జరుగుతున్న అంతర్జాతీయ ప్లీట్ రివ్యూను ఏపి ప్రభుత్వం గ్రాండ్‌గా జరుపుతోంది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి, నరేంద్ర మోడి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ప్లీట్ రివ్యూకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కుమారుడు ఆర్నవ్‌ని వెంటబెట్టుకొని వచ్చారు. ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ అర్నవ్ చెవిని సరదాగా పట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటో ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

ఇలా దేశ ప్రధాని సరదాగా చెవి పట్టుకొని చమత్కారం చేయడమంటే చాలా ఆనందపడే విషయం అందుకే ఆ సరదా సన్ని వేశాన్ని సెల్ఫీ ద్వారా క్లిక్‌మనిపించారు. ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆర్నవ్ తన ఆనందాన్ని సన్నిహితులుతో షేర్ చేసుకున్నారు. ఇది తన జీవితంలో మరచిపోలేని సంఘటనగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X