»   » 102 ఏళ్ల ప్రముఖ నటి మృతి, మోడీ సంతాపం

102 ఏళ్ల ప్రముఖ నటి మృతి, మోడీ సంతాపం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి జోహ్రా సెహగల్ కన్ను మూసారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. 1912లో ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ లో జన్మించిన జోహ్రా సెహగల్ 1946లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ప్రముఖ నటిగా పేరొందారు. 1998లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, 2010లో పద్మ విభూషణ్‌ అందుకున్నారు.

జోహ్రా సెహగల్ గత కొంత కాలంగా గుండె సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో వెంటనే ఆమెను ఢిల్లీలోని మాక్స్ హాస్పటల్‌కు తరలించారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జోహ్రా కన్ను మూసారు. జోహ్రా సింఘాల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేసారు. అన్ని తరాల నటులకు ఆమె ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

PM Narendra Modi Mourns Zohra Sehgal's Death

గ్రాండ్ ఓల్డ్ లేడి ఆఫ్ బాలీవుడ్ గా జోహ్రాకు పేరుంది. జోహ్రా మృతి పట్ల అమితాబ్ బచ్చన్, మాధుర్ బండార్కర్ తదితర సినీ ప్రముఖులు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తదితరులు జోహ్రా కు నివాళులు అర్పించారు. బాలీవుడ్లో వచ్చి భాజి ఆన్ ది బీచ్ (1992), హమ్ దిల్ దే చుక్కే సనమ్, బెడ్ ఇట్ లైక్ బెక్ హామ్(2002), దిల్ సే (1998), చీని కమ్ (2007) చిత్రాల్లో జోహ్రా సెహగల్ నటించారు.

English summary

 Prime Minister Narendra Modi on Thursday condoled the death of cinema and theatre veteran Zohra Sehgal, calling her "prolific and full of life". "Prolific & full of life, Zohra Sehgal made a mark through her acting, which is admired across generations. Saddened on her demise," Modi tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu