»   » ‘నీచంగా చూస్తారు, బాలీవుడ్ ఎప్పటికీ బాహుబలి తీయలేదు’

‘నీచంగా చూస్తారు, బాలీవుడ్ ఎప్పటికీ బాహుబలి తీయలేదు’

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాలీవుడ్ ఎప్పటికీ బాహుబలి లాంటి సినిమాను తీయలేదని, అక్కడ అసలు క్రమశిక్షణ అనేది ఉండదు. పేరుకే అక్కడ భారీ బడ్జెట్ సినిమాలు.... ప్రొడక్షన్ కాస్ట్ తక్కువు, స్టార్స్ రెమ్యూనరేషన్ ఎక్కువ అంటూ... సంచలన కామెంట్స్ చేసారు సౌండ్ డిజైనర్ పిఎం సతీష్.

  బాహుబలి ప్రాజెక్టుకు సౌండ్ డిజైనర్ గా చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్న పిఎం సతీష్ అంతకు ముందు అనేక బాలీవుడ్ చిత్రాలకు పని చేసారు. ఆయన చేసిన బాలీవుడ్ మూవీస్ కు జాతీయ అవార్డులు సైతం దక్కాయి.

  డిసిప్లిన్ ఉండదు

  డిసిప్లిన్ ఉండదు

  బాలీవుడ్లో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్న సతీష్ అక్కడి స్టార్ల తీరుపై, దర్శకుల వ్యవహార శైలిని తప్పుబట్టారు. బాలీవుడ్లో అసలు డిసిప్లిన్ అనేది ఉండదని ఆయన విమర్శలు చేసారు.

  నీచంగా చూస్తారు

  నీచంగా చూస్తారు

  బాలీవుడ్లో టెక్నీషియన్లు అసలు విలువ ఇవ్వరని, ఏదైనా మంచి విషయం చెప్పినా వినిపించుకునే పరిస్థితి అక్కడ ఉండదని.... బాలీవుడ్ బిగ్గీస్ టెక్నీషియన్లను చాలా నీచంగా చూస్తారు అంటూ సతీష్ వ్యాఖ్యానించారు.

  టాలీవుడ్ పై ప్రశంసలు

  టాలీవుడ్ పై ప్రశంసలు

  బాహుబలి సినిమాకు పని చేసిన తాను ఇక్కడి పరిశ్రమలో క్రమశిక్షణకు ముగ్దుడైపోయానని, తెలుగులో దర్శకులు, హీరోలు ఏదైనా సినిమాకు ఉపయోగ పడే విషయం తాము చెబితే వింటారని, బాలీవుడ్లో అలాంటి పరిస్థితి ఉండదన్నారు.

  పేరుకే బాలీవుడ్లో పెద్ద బడ్జెట్

  పేరుకే బాలీవుడ్లో పెద్ద బడ్జెట్

  బాలీవుడ్లో పేరుకే పెద్ద బడ్జెట్ సినిమాలు. సినిమా నిర్మాణానికి ఖర్చు పెట్టేది తక్కువ, స్టార్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ ఎక్కువ అని సతీష్ అన్నారు. రూ. 600 కోట్లతో సినిమా తీస్తే అందులో 100 కోట్లు మాత్రమే నిర్మాణానికి, మిగిలిన రూ. 500 కోట్లు రెమ్యూనరేషన్ల కోసం ఖర్చు పెడతారని తెలిపారు.

  English summary
  PM Sateesh, a National Award winning sound designer who created stunning sound for films like Kaminey and Ishqiya, has worked on Baahubali has well. Using Dolby Atmos technology and recording various folio for Baahubali 2 at Ramoji Film City's godowns, he created stunning output for the movie. As he's getting a unanimous appreciation for his work, he reveals why Bollywood can't a Baahubali due to two reasons.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more