»   » న్యాయమూర్తులను కించపరిచారంటూ రజనీకాంత్ పై కోర్టు కేసు

న్యాయమూర్తులను కించపరిచారంటూ రజనీకాంత్ పై కోర్టు కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: న్యాయమూర్తులకు వ్యతిరేకంగా రజనీకాంత్ వ్యాఖ్యలు చేసారని, వారిని కించ పరిచే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ పిఎంకె నాయకుడు, న్యాయవాది జానకీరామన్ రాణిపేట మునిసిఫ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఆయనపై పోలీసులు చర్య తీసుకునేలా ఆదేశించాలంటూ తన పిటీషన్లో కోర్టుకు విన్నవించారు. ఇటీవల తమిళ రచయిత వైరముత్తు పై కూడా ఇలాంటి కేసు నమోదైంది.

సెప్టెంబర్ పన్నెండవ తేదీన చెన్నైలో ఓ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ..దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టినా, ప్రజలు చెడ్డవాళ్లుగా మారినా, న్యాయమూర్తులు నిజాయితీతో వ్యవహరిస్తే దేశం బావుంటుందని రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్ కామెంట్ న్యాయమూర్తులను అవమాన పరిచే విధంగా ఉన్నాంటూ తొలుతు రాణీపేట పోలీసులకు, తర్వాత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసారు. వారి నుండి ఎలాంటి చర్యలు లేక పోవడంతో కోర్టును ఆశ్రయిచినట్లు పిటీషనర్ పేర్కొన్నారు. మరి కోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

PMK leader petition against Rajinikanth

రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం రజనీకాంత్ తమిళంలో ‘కబాలి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు 'మహదేవ' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం రిలీజ్ ని తమిళ న్యూ ఇయర్ అయిన ఏప్రిల్ 14న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు రజనీకాంత్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు. దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

PMK leader petition against Rajinikanth

కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు. వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు. సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం. ఆమె రజనీకుమార్తె. దన్సిక మాట్లాడుతూ... దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు. అలాగే దర్శకుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తండ్రి గజరాజు..ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు.

కబాలి సినిమా తర్వాత రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో ‘రోబో-2' చేయబోతున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

English summary
PMK leader files petition against South Super star Rajinikanth.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu