twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పోకిరి'లో మహేష్ డైలాగులు చెప్పిన కృష్ణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు సూపర్ హిట్ 'పోకిరి' లోని 'భయమంటే తెలీని బ్లడ్‌రా నాది... ఒక్కసారి కమిటయితే నా మాట నేనే వినను' వంటి డైలాగ్స్ ఎంత పాపులరో తెలిసిందే. ఆ డైలుగుల ప్రస్తుతం కృష్ణ నోటివెంట వినపడనున్నాయి. శ్రీకాంత్ హీరోగా వస్తున్న 'సేవకుడు' చిత్రంలో ఈ డైలాగులు కృష్ణ చేత చెప్పించారు.

    ఈ విషయం గురించి దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... " ఆ డైలుగుల ప్రస్తుతం కృష్ణ నోటివెంట వస్తుంటే థియేటర్లు ఈలలతో మారుమోగిపోవడం ఖాయం. కృష్ణగారు ఇందులో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఐదవ వ్యక్తిగా నటించారు. తను పుట్టి పెరిగిన విజయవాడ నగరానికి ఏదైనా సేవ చేయాలనీ, పేదవారికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాలనే తపనతో అమెరికా నుంచి వచ్చే వ్యకిగా కనిపిస్తారు. ఆయన ఇంట్రడక్షన్ సీన్లు అద్భుతంగా ఉంటాయి. అభిమానులను కృష్ణ, మంజుల పాత్రలు బాగా అలరిస్తాయి. ఫస్టాఫ్‌లో బ్రహ్మానందం కామెడీ అలరిస్తుంది'' అని చెప్పారు.

    అలాగే... ''సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే అనుకోను. ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించే, స్ఫూర్తి కలిగించేదిగా ఉండాలనుకుంటాను. అందుకే నా ప్రతి సినిమాలోనూ సామాజిక అంశం ఉంటుంది'' అన్నారు వి. సముద్ర. శ్రీకాంత్ హీరోగా కృష్ణ ప్రత్యేక పాత్రలో సముద్ర దర్శకత్వం వహించిన 'సేవకుడు' రేపు తెరకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సముద్ర పై విధంగా స్పందించారు. 'సేవకుడు' గురించి మరిన్ని విశేషాలు ఆయన ఇలా చెప్పారు.

    ''తప్పు చేసినవాడికి శిక్ష పడాలి అని చెప్పే సినిమా ఇది. ప్రస్తుత సంఘటనలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఇటీవల ఢిల్లీలో నిర్భయకు జరిగిన దారుణాన్ని అందరూ ఖండిస్తున్నారు. దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే అంటున్నారు. ఒక్క నిర్భయ విషయంలో మాత్రమే కాదు.. రాజకీయాల్లో ఉంటూ దేశాన్ని దోచుకుంటున్నవారికి, లంచగొండులకు, ప్రభుత్వోద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేస్తున్నవారికి.. ఇలా ప్రతి ఒక్కరికీ శిక్ష పడాలంటే చట్టంలో సవరింపులు రావాలని ఈ చిత్రంలో చెబుతున్నాం. ఇక్కడ పుట్టి, పెరిగి, డబ్బు సంపాదించుకుని, ఇక్కడే చచ్చిపోయే వ్యక్తులు స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటున్నారు. అలాంటివారికి ఈ చిత్రం మంచి సమాధానం అవుతుంది. తండ్రి ఆశయం కోసం పోలీస్ అయ్యే బాధ్యతల గల కొడుకుగా ఇందులో శ్రీకాంత్ నటించారు. అవినీతిని అంతం చేయడానికి అతను ఏం చేశాడు? అనేదే ఈ కథ''.

    ''ప్రపంచ ధనవంతుల్లో ఐదవ వ్యక్తి పాత్రను కృష్ణగారు చేశారు. అమెరికాలో స్థిరపడే ఆయన పుట్టిన ఊరి మీద మమకారంతో విజయవాడ వచ్చి, సేవ చేయాలనుకునే పాత్ర ఆయనది. అయితే సేవ చేయడానికి కూడా లంచం ఇవ్వాలని కూతురు చెప్పిన మాట విని షాక్ అవుతాడు. చివరికి సేవకుడు సహాయంతో తను అనుకున్నది ఎలా సాధించాడనేది ఈ చిత్రంలో ఆసక్తికరమైన అంశం. తండ్రీకూతుళ్లుగా కృష్ణగారు, మంజుల నటించడం ఈ చిత్రానికి హైలైట్. అలాగే 'పోకిరి'లో మహేష్‌బాబు చెప్పిన డైలాగులను ఈ ఇద్దరితో చెప్పించాం. సంక్రాంతికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'నాయక్' విడుదలవుతున్నాయి. రెండు సింహాల మధ్య ఒక పెద్ద పులిలా 'సేవకుడు' వస్తున్నాడు. ఇది మంచి సీజన్ కాబట్టి.. అన్ని సినిమాలకూ ఆదరణ లభిస్తుందనుకుంటున్నాను'' అన్నారు సముద్ర.

    English summary
    Srikanth's new movie 'Sevakudu' relesing tomorrow. Charmi is playing the female lead in this movie which has obtained 'A' certificate by the authorities recently. V Samudra has directed 'Sevadu' .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X