»   » దాంతో పోలిస్తే మహేష్ బాబు ‘పోకిరి’ పెద్ద ప్లాప్... ఇదేం పోలిక?

దాంతో పోలిస్తే మహేష్ బాబు ‘పోకిరి’ పెద్ద ప్లాప్... ఇదేం పోలిక?

Posted By:
Subscribe to Filmibeat Telugu
దాంతో పోలిస్తే ‘పోకిరి’ పెద్ద ప్లాప్... పూరీ పై వర్మ కామెంట్..!

మహేష్ బాబు కెరీర్లో 'పోకిరి' సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరోజుల్లో అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇపుడు 'పోకిరి' సినిమా ప్రస్తావనతో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది.

 పూరి తాజా సినిమాను ఉద్దేశించి

పూరి తాజా సినిమాను ఉద్దేశించి

ప్రస్తుతం పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ‘మెహబూబా' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని సీన్లను రామ్ గోపాల్ వర్మ ఇటీవల చూశారట. ఆ సీన్లు చూసిన వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు.

 పోకిరి చిత్రం పెద్ద ప్లాప్

పోకిరి చిత్రం పెద్ద ప్లాప్

‘మెహబూబా' సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూశాను. ఈ చిత్రంతో పోలిస్తే పూరీ తెరకెక్కించిన ‘పోకిరి' సినిమా పెద్ద ఫ్లాప్. బహుశా హీరో తన కుమారుడే కాబట్టి పూరీ ‘మెహబూబా' సినిమాను ఇంత బాగా తీశారేమో. ఈ సినిమా చాలా బాగుంది' అని ట్వీట్‌ చేశారు.

 లవ్ యూ సార్ అంటూ పూరి రిప్లై

లవ్ యూ సార్ అంటూ పూరి రిప్లై

రామ్ గోపాల్ వర్మ ట్వీటుకు వెంటనే పూరి రిప్లై ఇచ్చారు. ‘మొదటి సారి నా బాస్‌ నన్ను ఓ మంచి దర్శకుడిగా గుర్తించారు. నా జీవితంలో నేను అందుకున్న గొప్ప ప్రశంస ఇదే. లవ్ యూ సర్‌' అని ట్వీట్‌ చేశారు.

 ఇదేం పోలిక?

ఇదేం పోలిక?

ఒక సినిమాను గొప్పగా పొగడటానికి మరో సినిమాను కించ పరచడం ఏమిటి అంటూ మహేష్ బాబు అభిమానులు వర్మపై మండి పడుతున్నారు. ‘పోకిరి' సినిమా తెలుగు సినిమా హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రమని, ఈ సినిమా గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం తగదని అంటున్నారు.

 మెహబూబా

మెహబూబా

‘మెహబూబా' సినిమా వివరాల్లోకి వెళితే 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో లవ్ స్టోరీ. ఈ చిత్రం ద్వారా తన కుమారుడిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు పూరి. అందుకే తనే స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.

English summary
"I just saw parts of purijagan ‘s Mehbooba and I strongly feel Mahesh‘s Pokiri is a flop in comparison ..Could be becos of his love for his son that he made this film so special." Puri Jagannadh tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu