»   » ‘కడుపు చేస్తామన్నపుడు వదిలేసి తప్పుచేసాం:యాంకర్ రవి కాళ్లు విరగ్గొడతాం’

‘కడుపు చేస్తామన్నపుడు వదిలేసి తప్పుచేసాం:యాంకర్ రవి కాళ్లు విరగ్గొడతాం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ చైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి చేసిన నీచమైన వ్యాఖ్యలపై మహిళ సంఘాలు భగ్గుమన్నాయి. చలపతి రావుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మహిళా సంఘాల నేతలు సజయ, దేవి ఫిర్యాదు చేసారు.

మరో వైపు చలపతిరావు చేసిన కామెంట్లను సమర్ధిస్తూ సూపర్ గా చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేసిన యాంకర్ రవిపై కూడా మహిళా సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. యాంకర్ రవి తమకు ఎక్కడైనా కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటివి ఎక్కువ

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటివి ఎక్కువ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళల పట్ల చాలా నీచమైన దృక్ఫథం ఉందని, వారు పెట్టే పేర్లు, ట్యాగ్ లైన్లు, యాంకర్లు మాట్లాడే బాష ఇవన్నీ చాలా దారుణంగా ఉంటున్నాయని, జెండర్ ఇన్సెన్సివిటీని ఒక జోక్ గా మార్చిన ఘనత తెలుగు ఇండస్ట్రీకే దక్కుతుందని మహిళ సంఘాల నేత సజయ అన్నారు. చలపతి రావు చేసిన కామెంట్స్ విన్న తర్వాత ఆయన వయసు కూడా గౌరవం ఇవ్వాలని అనిపించడం లేదు. అలాంటి కామెంట్స్ చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి. అలాంటి వ్యక్తులు తెలుగు సినిమా పరిశ్రమను భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. వెంటనే అతడు మహిళలకు మాత్రమే కాదు ఈ మానవ జాతి మొత్తానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.

యాంకర్ రవి కాళ్లు విరగ్గొడతాం

యాంకర్ రవి కాళ్లు విరగ్గొడతాం

చలపతిరావు కామెంట్స్ ను సూపర్ అంటూ సమర్ధించిన యాంకర్ రవిపై కూడా మహిళ సంఘాలు భగ్గుమన్నాయి. అతడు ఎక్కడైనా కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించాయి. అతడు యాంకరింగ్ చేస్తున్న షోలలో కూడా మహిళల గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నాడని, నీ తల్లి గురించి అలా మాట్లాడితే కూడా ఇలాగే సూపర్ అంటావా యాంకర్ రవి.... అంటూ మహిళ సంఘాలు భగ్గుమన్నాయి.

నాగార్జున కుటుంబం మొత్తం క్షమాపణలు చెప్పాలి

నాగార్జున కుటుంబం మొత్తం క్షమాపణలు చెప్పాలి

నాగార్జున కుటుంబానికి చెందిన ఫంక్షన్లో ఇలాంటి చోటు చేసుకున్నాయి కాబట్టి నాగార్జున కుటుంబం మొత్తం వచ్చి.... నా కొడుకు ఫంక్షన్లో ఇలాంటివి జరిగాయి కాబట్టి అంతా కలిసి క్షమాపణలు చెప్పాలి అని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేసారు.

కడుపులు చేయడానికి పని కొస్తారు అన్నపుడే గట్టిగా చర్యలు తీసుకోవాల్సింది...

కడుపులు చేయడానికి పని కొస్తారు అన్నపుడే గట్టిగా చర్యలు తీసుకోవాల్సింది...

మహిళలు కడుపులు చేయడానికి పనికొస్తారు అని గతంలో ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి అన్నపుడే క్షమాపణలతో వదిలేయకుండా గట్టిగా చర్యలు తీసుకోవాల్సింది. ఇపుడు దీన్ని అంత తేలికగా వదిలేయకూడదనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు.

చలపతిరావు తోలుమందం తగ్గిస్తాం

చలపతిరావు తోలుమందం తగ్గిస్తాం

చలపతిరావుకు తాను చేసిన కామెంట్స్ ఎంత నీచమైనవో, ఎంత దారుణమైనవో తెలినంతగా ఖడ్గమృగం చర్మ ఉంది. అందుకే తన కామెంట్లను సమర్ధించుకుంటున్నాడు. అతడికి ఆ తోలు మందాన్ని తగ్గించడం కోసమే కేసు పెడుతున్నామని మహిళ సంఘాల నాయకురాలు దేవి అన్నారు.

నా తల్లి, చెల్లి, నా కూతురు అని ఆలోచించేలా చేస్తాం...

ఇకపై సినిమా రంగానికి చెందిన వారు ఏమైనా కామెంట్స్ చేయాలంటే... నా తల్లి, నా చెల్లి, నాకూతురు అని ముందుగా ఆలోచించి కామెంట్స్ చేసేలా సినిమా రంగాన్ని తయారు చేస్తామని.... చలపతిరావు వ్యవహారాన్ని మామూలుగా వదిలిపెట్టబోమన్నారు.

చలపతిరావు, రవి ఇద్దరినీ బహిష్కరించాలి...

చలపతిరావు, రవి ఇద్దరినీ బహిష్కరించాలి...

మహిళల పట్ల చాలా దారుణమైన కామెంట్స్ చేసిన చలపతిరావు, యాంకర్ రవిలను సినిమా రంగం నుండి బహిష్కరించాలని, అపుడు ఇలాంటి నీచమైన బుద్దులు, నీచమైన ఆలోచనలు మారుతాయని మహిళా సంఘాల నేతలు అభిప్రాయ పడ్డారు.

ఎంతో మంది అమ్మాయిలను రేప్ చేశానంటూనే...

ఎంతో మంది అమ్మాయిలను రేప్ చేశానంటూనే...

గతంలో కూడా చలపతిరావు ఎంతో మంది అమ్మాయిలను రేప్ చేశానంటూనే నిజజీవితంలో కాదు సినిమాల్లో అని వెంటనే మాటమార్చి తప్పించుకున్నారని వారు తెలుపుతున్నారు. ఇక నుంచి మహిళలపై ఇలాంటి కామెంట్లు చేస్తే వాడు హీరోనా... జీరోనా.... మంత్రినా అని చూసే ప్రశ్నే ఉండదని.. వాడి తాట తీస్తామని మహిళా సంఘాలు హెచ్చరించాయి.

English summary
Police Case on Chalapathi Rao. Actor Chalapathi Rao Made some Sensational Comments on Woman in Rarandoi Veduka Chuddam Audio Function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu