twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: హృతిక్ రోషన్ పై పోలీస్ కేసు

    |

    Recommended Video

    KPHB Police Registered Cheating Case On Actor Hrithik Roshan || Filmibeat Telugu

    కొన్ని వార్తలు ఊహించని షాకిస్తుంటాయి. కలలో కూడా అనుకోని కొన్ని సంఘటనలు ఆశ్చర్య పరుస్తాయి. అలాంటి సంఘటనే ఒకటి తాజాగా హీరో హృతిక్ రోషన్ విషయంలో జరిగింది. ఎక్కడో బాలీవుడ్‌లో ఉండే హీరో హృతిక్ రోషన్‌పై హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి పోతే..

    ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్

    ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్

    కల్ట్ ఫిట్‌నెస్ అనే ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు హృతిక్ రోషన్. ఈ సంస్థ ఫ్రాంచసీ హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఉంది. తాజాగా ఈ సంస్థపై ఆరోపణలు చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు శశి అనే వ్యక్తి. తాను ఫీజు చెల్లించినప్పటికీ తనకు కేటాయించిన స్లాట్ ఇవ్వటం లేదని శశి అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

     హృతిక్ రోషన్ పై కేసు నమోదు

    హృతిక్ రోషన్ పై కేసు నమోదు

    ఆ వ్యక్తి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం జిమ్ సెంటర్‌కు చెందిన కీలకమైన వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కల్ట్ ఫిట్ నెస్ యజమానులతో పాటు.. ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పైనా కేసు నమోదు చేశారు.

    కోర్టుకు హాజరు కావాల్సిందే

    కోర్టుకు హాజరు కావాల్సిందే

    కల్ట్ ఫిట్‌నెస్ యాజమాన్యం కెపాసిటీకి మించి వ్యక్తులను జిమ్ లోకి అనుమతిస్తోందని, ఆ కారణంగా జిమ్ లోని వస్తువుల కొరత ఏర్పడుతోందని శశి ఫిర్యాదు చేశాడు. శశి ఫిర్యాదు మేరకు ఈ కేసును కోర్టుకు పంపించనున్నారు కూకట్‌పల్లి పోలీసులు. చూడాలి మరి ఈ కేసుకు సంబంధించి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో!

    హైదరాబాద్ చుట్టూ తిరగక తప్పదేమో

    హైదరాబాద్ చుట్టూ తిరగక తప్పదేమో

    సాధారణంగా హైదరాబాద్ అంటే తెలుసేమో గానీ.. అందులో కూకట్‌పల్లి అనే ఓ ప్రాంతం ఉందన్న విషయం హృతిక్ రోషన్‌కి తెలియదేమో! కానీ ఈ కేసు నేపథ్యంలో ఇకపై ఆయన ఈ పేరును తరచూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఖాయం. అంతేకాదు ఆయన హైదరాబాద్ చుట్టూ తిరగక తప్పదేమో..!

    English summary
    In hyderabad Kukatpalli police station the police case is filed on Bollywood hero Hrithik Roshan. As per shashi report hyderabad police filed a case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X