»   » నకిలీ అరెస్టు: వర్మపై కేసు పెట్టనున్న పోలీసులు!

నకిలీ అరెస్టు: వర్మపై కేసు పెట్టనున్న పోలీసులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుమతి లేకుండా పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఎక్కడమే కాకుండా ఫోటో దిగి తాను అరెస్ట్ అయ్యానంటూ ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్విటర్‌లో పోస్టుచేసిన ఉదంతాన్ని బంజారాహిల్స్ పోలీసులు సీరియస్ అయ్యారు. వర్మపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల అభిప్రాయాన్ని కోరుతున్నట్టు తెలిసింది. ఆదివారం ఉదయం శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగమం వద్ద విధుల్లో ఉన్న బంజారాహిల్స్ పెట్రోలింగ్ వాహనంలోకి రాంగోపాల్ వర్మ సివిల్ దుస్తుల్లో ఎక్కి ముందు సీట్లో కూర్చున్నారు.

Police case to be filed on RGV

నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఫోటో దిగి అరెస్ట్ అయ్యానంటూ తప్పుడు సందే శాన్ని ట్విట్టర్లో పోస్టు చేసారు. ఈ ఘటనపై డ్రైవర్ శ్రీధర్‌రెడ్డిని ఉన్నతాధికారులు ఆదేశించారు. శ్రీధర్‌రెడ్డి ద్వారా ఫిర్యాదు తీసుకుని వర్మపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమౌతున్నట్లు తెలిసింది.

రామ్ గోపాల్ వర్మ ప్రవర్తించని తీరు....పోలీసు వ్యవస్థని కించ పరిచే విధంగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తలో మరెవరూ వేలాకోలానికి, తమ పబ్లిసిటీ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తనగిన చర్యలు తీసుకోవాలని పోలీసు డిపార్టుమెంటు భావిస్తోంది.

English summary
Police case to be filed on RGV for objectionable tweet.
Please Wait while comments are loading...