»   » స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ప్రభాస్ హీరోయిన్..పోలీస్ విచారణ

స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ప్రభాస్ హీరోయిన్..పోలీస్ విచారణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
న్యూఢిల్లీ: ప్రభాస్ సరసన బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంలో చేసిన సంజన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడామె స్పాట్ ఫిక్సింగ్ కేసులో పోలీస్ విచారణ ఎదుర్కోవటానికి రెడీ అవుతోంది. కన్నడ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా చేసిన బెంగళూరుకు చెందిన సంజనకు శ్రీశాంత్‌తో చాలాకాలంగా పరిచయముంది. సంజనతో మరో నటిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.

కన్నడ తార సంజన అర్చన చిక్కుల్లో పడింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇరుక్కున్న క్రికెటర్‌ శ్రీశాంత్‌కు ఆమె ఆప్తురాలు కావడంతో సంజనను ప్రశ్నించాలని ముంబయి పోలీసులు భావిస్తున్నారు!. ''ముంబయి పోలీసులు ప్రాథమికంగా సంజన గురించి వివరాలు కనుక్కున్నారు. ఆమెను విచారించడానికి త్వరలో సమన్లు పంపే అవకాశం ఉంది'' అని ఓ అధికారి చెప్పారు.

ఐపీఎల్‌లో మ్యాచ్‌ల అనంతరం జరిగే పార్టీలకు సంజన తరచూ హాజరవుతుండేది. 2009లో గోవా డిస్కోథెక్‌లో శ్రీశాంత్‌, సంజన డ్యాన్స్‌ చేస్తూ కెమేరాలకు చిక్కడంతో వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని అప్పట్లో వదంతులొచ్చాయి. అయితే ఈ వార్తల్ని సంజన వెంటనే ఖండించింది.

English summary

 Sanjana getting tension with Sreesanth IPL spot fixing expisode. Police May interagate Sanjana for Srishant Spot fixing Case
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu