»   » యువతను పెడదోవ పట్టిస్తున్న నాగార్జున, రాణా!?

యువతను పెడదోవ పట్టిస్తున్న నాగార్జున, రాణా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున హీరోగా రూపొందిన 'కేడి" చిత్రం ఇటీవలే విడుదలయ్యింది. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్ లో నాగార్జున ఎక్కువగా సిగరెట్ తాగుతున్నట్టు ఉన్న ఫోటోలే ఫ్రింట్ అయ్యాయట. ఈ స్టిల్స్ చూసి యూత్ కూడా ఇదే ఫాలో అయ్యే అవకాశముందని, ఇలాంటి స్టిల్స్ కు ఫోజులు ఇవ్వవద్దని విజయనగరంకు చెందిన రవికృష్ణ అనే అసిస్టెంట్ సూపరిండెంట్ పోలీస్ ఆఫీసర్ నాగార్జునకు అపీల్ పంపిచ్చాడట. అప్పీల్ చేసాడో లేక వార్నింగ్ ఇచ్చాడో వారికే తెలియాలి.

నాగార్జున సిగరెట్ తాగుతూ ఇచ్చిన స్టిల్స్ చాలా స్టైల్ గా ఉన్నాయని, ఇవి యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయని సమాచారం. ఈ నేపధ్యంలోనే పోలీసాఫీసర్ నాగ్ ముందు ఇలాంటి అపీల్ పెట్టినట్టు తెలుస్తోంది. నాగ్ ఈ అపీల్ కు ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. మరి రీసెంట్ గా విడుదలైన మరో చిత్రం 'లీడర్" లో కూడా హీరో రాణా సిగరెట్ తాగుతూ సినిమా తెరఫై కనిపించడం ఇలాంటి ఇన్సిడెంట్సే సభ్యసమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది. ఇలాంటి వాటిని సెన్సార్ బోర్డు ఎలా సమర్థిస్తుందో, ఇది ఎంత వరకూ సమంజసమో వారికే తెలియాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu