»   » పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు ఘోర అవమానం, ఎందుకు ఇలా జరిగింది ?

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు ఘోర అవమానం, ఎందుకు ఇలా జరిగింది ?

Posted By: Sreedhar
Subscribe to Filmibeat Telugu
Sri Reddy Got Opposition From Pawan Fans

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సినీనటి శ్రీరెడ్డి వివాదం కొత్త మలుపు తిరిగింది. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు చేసిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొన్నారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఎదుట చేసిన ధర్నా రసాభాసగా మారింది. ఎంతకు ఈ వివాదంలో ఏమి జరిగిందంటే..

 పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి ఫైర్

పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి ఫైర్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. సోమవారం నాడు హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీరెడ్డి.. 'పవన్ కళ్యాణ్.. నిన్ను అన్నా అని అన్నందుకు చెప్పుతో కొట్టుకోవాలంటూ అన్నంత పని చేసింది. పవన్ కళ్యాణ్ ను అన్నా అన్నందుకు తన చెప్పుతో తను కొట్టుకుంది. ఇదంతా మీడియా చూస్తుండగా జరిగిన సంఘటన.

కొత్త మలుపు తిరిగిన వివాదం

కొత్త మలుపు తిరిగిన వివాదం

తాజాగా శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ తల్లి పై చేసిన కామెంట్స్ అందరికి తెలిసిందే. ఆ కామెంట్స్ విన్న అభిమానులు ఆమెను తీవ్రస్థాయిలో విమర్శించారు. అందుకు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పడం. ఇంతటితో ఈ మ్యాటర్ క్లోజ్ అవుతుందని అనుకున్నారు అంతా. కానీ ఈ విషయం కొత్త మలుపు తిరిగింది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

మంగళవారం (17వ తేదీ) ఉదయం కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీ‌రెడ్డి‌పై కేసు పెట్టడానికి జూబ్లి హీల్స్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ అభిమానులకు చేసు అనుభవం ఎదురు అయ్యింది. నిరసన తెలుపుతున్న అభిమానుల్ని పొలిసు వారు అరెస్ట్ చెయ్యడం జరిగింది.

టీవీ9 ఛానెల్ ఎదుట ధర్నా

టీవీ9 ఛానెల్ ఎదుట ధర్నా

అదిలా ఉండగా, శ్రీరెడ్డి ఇంటర్వ్యూ ప్రసారం చేసిన టీవీ9 ఎదుట పవన్ ఫ్యాన్స్ ధర్నా నిర్వహించారు. టీవీ9 ఛానెల్ ప్రసారాల తీరుపై నిరసన తెలుపుతున్న అభిమానుల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. శ్రీరెడ్డి వ్యాఖ్యలు సినీ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సినీ వర్గాలను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్లు సంచలనంగా మారాయి.

English summary
sri reddy addressing the press recently, Pawan Kalyan was asked for his comments on actorSri Reddy, who recently made serious sexual harassment allegations against some of the biggest names of the Telugu film industry. recently pawan fans arrested on this issue
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X