»   » సూరి హత్య కేసులో విచారణకు రామ్ గోపాల్ వర్మ

సూరి హత్య కేసులో విచారణకు రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని ఈ రోజు (సోమవారం)..మద్దెల చెవురు సూరి హత్య కేసులో సీసీఎస్‌ పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. రక్త చరిత్ర పార్ట్-2 చిత్రీకరణ నిమిత్తం సూరి పెట్టుబడులు పెట్టాడన్న కోణంలో ఈ ఎంక్వైరీ జరగనుంది. సూరికి వర్మకి మధ్య కో ఆర్డనేటర్ గా భాను వ్యవహించాడని చెప్తున్నారు. ఇక భాను..రక్త చరిత్ర చిత్రం కు అవసరమైన లొకేషన్స్ ను చూపించడంలో సహాయపడ్డాడని ఇప్పటికే తెలుగువెర్షన్ నిర్మాత సి.కళ్యాణ్ పోలీసులకు తెలిపటం ఈ విచారణకు అవకాశమిచ్చింది. ఇదిలా ఉండగా మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌పై సీసీఎస్‌లో మరో కేసు నమోదు అయ్యింది. సినీ నిర్మాత సింగనమల రమేష్, భాను కిరణ్ తనను బెదిరించారంటూ ఫైనాన్షియర్ జయంతిరెడ్డి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.ఇక వర్మ ఈ కేసులో ఏం సమాధానం చెపుతారో అన్న విషయం అంతటా ఉత్కంతట నెలకొని ఉంది.ఇక ఇప్పటికి ఈ హత్య కేసులో ఇరవై ఏడు మందిని విచారిస్తే అందులో ఏడుగురు సినిమావారే కావటం విశేషం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu