»   » హీరో రాజశేఖర్ సినిమాపై పోలీస్ కేసు... ఏం జరిగింది?

హీరో రాజశేఖర్ సినిమాపై పోలీస్ కేసు... ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ "పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం". ఈ సినిమాపై యూనిట్ మీద హైదరాబాద్ పోలీసులు కేసు పెట్టారు. వీరి మూలంగా నారాయణగూడ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడమే కారణం.

షూటింగ్ నిమిత్తం నారాయణగూడ ఫ్లయ్ ఓవర్ పై ఉదయం 7 గంటల వరకూ అనుమతి పొందిన యూనిట్, ట్రాఫిక్ ను ఆపి రాత్రి నుంచి షూటింగ్ చేసుకుంటున్నారు. ఉదయం 7 గంటల తరువాత కూడా షూటింగ్ కొనసాగుతూ ఉండటంతో, ట్రాఫిక్ స్తంభించింది. అక్కడకు వెళ్లిన పోలీసులు, తక్షణం ఫ్లయ్ ఓవర్ ను ఖాళీ చేయాలని చెప్పగా యూనిట్ సభ్యులు వాదనకు దిగడంతో పోలీసులు కేసు పెట్టారు.


ముఖ్య పాత్రధారులు

ముఖ్య పాత్రధారులు

రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ గృహిణి పాత్ర‌లో న‌టిస్తుంది. జార్జ్ అనే క‌రుగుగ‌ట్టిన విల‌న్ పాత్ర‌లో కిషోర్ స‌హా నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, శ‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, ర‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌, చ‌ర‌ణ్ దీప్‌, ర‌వి రాజ్ త‌ది త‌రులు నటిస్తున్నారు.జూన్‌లో జార్జియాలో షూటింగ్

జూన్‌లో జార్జియాలో షూటింగ్

ఈ చిత్రం జూన్ నెలలో జార్జియాలో ఎంగురి డ్యామ్‌లో వద్ద కొన్ని కీలకమైన సీన్లు చిత్రీకరించారు. జార్జియా దేశానికి మూడొంతులు పైగా ఎల‌క్ట్రిసిటీ, తాగునీటిని స‌రఫ‌రా చేసే డ్యామ్ ఇది. జార్జియా ప‌శ్చిమాన ఉన్న ఈ డ్యామ్ ప్ర‌పంచంలోనే 6వ ఎత్తైన (271.5 మీ లేదా 891 అడుగులు) డ్యామ్. ఈ ప్రాంతంలో ఏడు రోజుల పాటు యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చిత్రీక‌ర‌ణ జ‌రుపారు.భారీ యాక్షన్

భారీ యాక్షన్

సినిమా షూటింగులో పారాచ్యూట్స్‌, మిల‌ట‌రీ విమానాలు, ఎం-16 మెషీన్స్ స‌హా భారీగా పేలుడు ప‌దార్థాల‌ను ఉప‌యోగించారు. దీంతో సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని భావిస్తున్నారు.తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేక‌ప్ః ప్ర‌శాంత్‌, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్స్ః శ్రీనివాస‌రావు ప‌లాటి, సాయి శివ‌న్ జంప‌న‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః ముర‌ళి శ్రీనివాస్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ః బాబీ అంగార‌, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌న్ః సి.వి.రావ్‌(అన్న‌పూర్ణ స్టూడియోస్‌), స్టంట్స్ః స‌తీష్‌, నుంగ్‌, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫ‌ర్ః విష్ణుదేవా, ఎడిట‌ర్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ర‌చ‌నః ప్ర‌వీణ్ స‌త్తారు, నిరంజ‌న్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, స‌మ‌ర్ప‌ణః శివాని శివాత్మిక ఫిలింస్‌, నిర్మాణంః జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్ర‌ఫీః అంజి, సురేష్ ర‌గుతు, శ్యామ్ ప్ర‌సాద్‌, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ప్రొడ్యూస‌ర్ః ఎం.కోటేశ్వ‌ర్ రాజు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.
English summary
Police Stopped shooting of Hero Rajasekhar's upcoming movie at Narayanaguda Flyover. Sources say that police arrested Production Manager for continuing shooting upto 9 though the permission is given only upto 7 in the morning.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu