»   »  సంజయ్ దత్: ఇరవయ్యేళ్ళకి తనసినిమాలో తానే విలన్ అవుతున్నాడు ?

సంజయ్ దత్: ఇరవయ్యేళ్ళకి తనసినిమాలో తానే విలన్ అవుతున్నాడు ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ కాంట్రవర్షియల్ హీరో సంజయ్ దత్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా సడక్. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను మహేష్ భట్ తెరకెక్కించారు. పూజా భట్ సంజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన 26 ఏళ్ల తరువాత ఇప్పుడు సీక్వల్ ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ తో ఆలియా బట్ కూడా నటించనుంది. ఇందులో వీళ్లిద్దరు తండ్రి కూతుళ్లుగా కనిపించనున్నారంట.

బాలీవుడ్‌లో కామనైపోయింది

బాలీవుడ్‌లో కామనైపోయింది

ఒకప్పటి హిట్ సినిమాను రీమేక్ చేయడం, వాటికి సీక్వెల్స్ ప్లాన్ చేయడం బాలీవుడ్‌లో కామనైపోయింది. అలా పాత సినిమాలకు రీమేక్‌గా, సీక్వెల్స్‌గా వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా కొందరు మూవీ మేకర్లు మాత్రం తమ పాత సినిమాలకు సీక్వెల్స్ తీయాలనే ఆలోచనలో తలమునకలవుతున్నారు.

"సడక్" దారిలోకి వచ్చింది

అదే క్రమం లో ఇప్పుడు సడక్ కూడా "దారిలోకి వచ్చింది" ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ జరుగుతున్నప్పటి ఫొటోను షేర్ చేయడం ద్వారా పూజా భట్ బాలీవుడ్లో పెద్ద చర్చ లేవనెత్తింది. ‘సడక్' ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే ‘సడక్-2' మొదలవుతుందని పూజా తెలిపింది. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా నటిస్తాడని ఆమె హింట్ ఇచ్చింది. దీంతో సంజూ పాత్ర ఎలా ఉంటుందా అన్న ఆసక్తి మొదలైంది.

ఇందులో విలన్ పాత్ర

ఇందులో విలన్ పాత్ర

ఈ సినిమాకు సంబంధించి అందుతున్న ఆసక్తికర సమాచారం ఏంటంటే.. ఫస్ట్ పార్ట్‌లో హీరోగా నటించిన సంజయ్ దత్.. ఇందులో విలన్ పాత్ర పోషిస్తాడట. హీరో హీరోయిన్లు ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఇంకో నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు బయటికి వస్తాయట

సరికొత్త రికార్డు

సరికొత్త రికార్డు

మొత్తానికి సంజయ్ అతని కెరియర్ లో హీరోగా చేసి, దాని సీక్వెల్ లో విలన్ గా చేయడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించడానికి రెడీ అయ్యాడు అని బీ-టౌన్ లో వినిపిస్తున్న మాట. ఒక నటుడు ఒక సినిమాలో హీరోగా నటించి.. దాని సీక్వెల్లో విలన్ పాత్రలో చేయడం అరుదైన విషయమే.

English summary
in SADAK Sanjay Dutt played a young man in love with a sex worker and fights against all odds to be with her. Now Pooja Bhatt might be re teaming with Mahesh Bhatt and Sanjay Dutt for the sequel of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu