»   » కోర్టు ఆదేశం: స్క్రిప్ట్‌ , రీళ్ల స్వాధీనం

కోర్టు ఆదేశం: స్క్రిప్ట్‌ , రీళ్ల స్వాధీనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : నటి పూజాగాంధీ నిర్మాతగా, నాయికగా నటించి, విడుదలకు సిద్ధంగా ఉన్న అభినేత్రి చిత్రానికి మళ్లీ అడ్డంకులు వచ్చి పడ్డాయి. చిత్రం స్క్రిప్ట్‌ను, రీళ్లను స్వాధీనం చేసుకోవాలని ఇక్కడి పదవ సిటీ సివిల్‌ కోర్టు మంగళవారం ఆదేశాల్ని జారీ చేసింది.

దివంగత నటి కల్పన జీవిత చరిత్రనే అభినేత్రి చిత్రంగా తెరకెక్కించారంటూ భాగ్య కృష్ణమూర్తి, పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు కోర్టులో అర్జీ వేసుకున్నారు. తాను రచించిన అభినేత్రి నవలనే కాపీ కొట్టి ఈ చిత్రం నిర్మించారనేది భాగ్య కృష్ణమూర్తి ప్రధాన ఆరోపణ.

తాను నిర్మాతగా ఉంటూ నాయికగా నటిస్తున్న అభినేత్రి చిత్రానికి, దివంగత నటి కల్పన జీవితానికి ఎటువంటి సంబంధం లేదని నటి పూజాగాంధీ కోర్టులో వివరణ ఇచ్చారు. కల్పన జీవితాన్ని పూజా చిత్రంగా తీస్తున్నారని, ఈ చిత్రం విడుదల కాకుండా ఆదేశించాలంటూ కల్పన బంధువులు కొందరు ఒకటవ ఏసీఎంఎం కోర్టులో దావా వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏసీఎంఎం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పూజా కోర్టుకు హాజరయ్యారు. కల్పన జీవితాన్ని తాను చిత్రంగా తీయటం లేదని న్యాయమూర్తి ముందు ఆమె వివరణ ఇచ్చారు.

Pooja Gandhi's 'Abhinetri' in Trouble

కల్పన జీవిత చరిత్రకు, తన చిత్రానికి ఎటువంటి సంబంధం లేదంటూ పూజాగాంధీ ఇప్పటికే ఒకమారు కోర్టు ముందుహాజరై వివరణ ఇచ్చారు. ఆమె వివరణకు సంతృప్తి చెందని న్యాయమూర్తి స్క్రిప్ట్‌ను, రీళ్లను స్వాధీనపరచుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు.

వెండితెరపై ఒక్కవెలుగు వెలిగి పరిస్థితుల ప్రభావంతో దుర్భర జీవితం సాగించిన హీరోయిన్స్ జీవితాల కథాంశంతో 'అభినేత్రి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి పూజాగాంధీ నిర్మాతగా మారడంతో పాటు ప్రధాన పాత్రను కూడా పోషిస్తోంది. కట్టుబొట్టు అలనాటి నటి కల్పనను పోలిఉన్నా ఆమె జీవితానికి అభినేత్రి సినిమాకు సంబంధం లేదని పూజా స్పష్టం చేశారు.

ఏడో దశకం నాటి పరిస్థితుల నేపథ్యంలో కథాగమనం ఉంటుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిత్రీకరణను కొనసాగించేందుకు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి వచ్చిందని తెలిపారు. రంగస్థలం నేపథ్యం కోసం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో చిత్రీకరణను పూర్తి చేశారు. అభినేత్రిలో అభినయం సవాల్‌గా తీసుకుని పూర్తిచేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే టాకీ పార్ట్‌ పూర్తయింది. ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోంది.

English summary

 Kannada film 'Abhinetri' said to be on the life sketch of all sorrowful heroines by Pooja Gandhi is not so but points to the life of 'Minuguthaare Kalpana' life says the new argument that is put forth in the court of law.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu