»   » ఆడియో కంపెనీ పెడుతున్న సెక్సీ హీరోయిన్

ఆడియో కంపెనీ పెడుతున్న సెక్సీ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: హీరోలు,హీరోయిన్స్, దర్శకులు ఇలా సినిమాలలో ఒక వెలుగు వెలుగుతున్న వారంతా తమ దగ్గరున్న డబ్బుని సినీ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ప్రముఖ కన్నడ నటి పూజాగాంధీ(దండు పాళ్యం పేమ్) ఆడియో రంగంలోకి ప్రవేశించటానికి రంగం సిద్దం చేసుకున్నారు.

సొంతంగా పూజగాంధీ (పిజి) మ్యూజిక్‌ సంస్థను నెలకొల్పారు. వచ్చేనెల 14న ఆమె నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న అభినేత్రి సినిమా ఆడియో విడుదల సందర్భంలో ఈ సంస్థను ప్రారంభిస్తారని తెలిసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాయచూరు నుంచి ఘోరపరాభవం ఎదురైన అనంతరం ఆమె గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

సినిమా రంగంపై దృష్టి సారించారు. వినూత్న కథలకే ఆమె ప్రాధాన్యతనిస్తున్నారు. తిప్పజ్జి సర్కిల్‌ సినిమాలో దేవదాసి పాత్రను పోషిస్తుండగా అభినేత్రి సినిమాలో సినీ నటి జీవితం నేపథ్యంలో ఉన్న పాత్రను పోషించారు. పిజి ఆడియో ద్వారా సొంత సినిమాలతో పాటు ఇతరుల సినిమాల ఆడియోల్ని కూడా విడుదల చేయనున్నారు.

English summary
Actress Pooja Gandhi is launching a new film related business. It will be an audio company named after herself. To be called PG Music, the first film audio from this company would be Abhinetri, in which Pooja plays the lead role. The audio company and the film's music will be launched together on February 14.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu