For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ హీరోను ఛీకొట్టిన తమన్నా, పూజాహెగ్డే.. కానీ హాట్‌హాట్‌గా శ‌్రుతిహాసన్ రెడీ!

By Rajababu
|
ఆ హీరోను ఛీకొట్టిన టాప్ హీరోయిన్స్.. కానీ శ‌్రుతి రెడీ !

స్టార్ హీరో పక్కన నటించాలని ఏ హీరోయిన్ అయినా కోరుకోవడం సహజం. అయితే వచ్చిన అవకాశాన్ని ఛీ కొట్టి ఓ హీరో పక్కన నటించే అవకాశాన్ని మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, అందాల తార పూజా హెగ్డే రిజెక్ట్ చేయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అందుకు కారణం ఆ చిత్రంలో సదరు హీరోతో హాట్‌హాట్‌గా నటించాల్సి రావడమే. అయితే ఆ ప్రాతలో నటించాలని శ్రుతిహాసన్‌తో నిర్మాతలు సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

ఊపు మీద ఉన్న పూజాహెగ్డే

ఊపు మీద ఉన్న పూజాహెగ్డే

కెరీర్ తొలినాళ్లలో పూజాహెగ్డేకు సక్సెస్ చేతికి అందినట్టే అంది చేజారాయి. తాజాగా అల్లు అర్జున్‌తో కలిసి నటించిన దువ్వాడ జగన్నాథం మంచి సక్సెస్‌ను అందించింది. దాంతో అమ్మడు కెరీర్ మంచి ఊపు మీద ఉన్నది. బాలీవుడ్‌లో కూడా భారీ సినిమాలు చేసిన నేపథ్యంలో పూజా వద్దకు ఓ హిందీ సినిమా ఆఫర్ వచ్చిందట.

యాక్షన్ చిత్రంలో

యాక్షన్ చిత్రంలో

బాలీవుడ్ సెక్సీ హీరో జాన్ అబ్రహం, విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్‌తో రాహ్ అనే చిత్రాన్ని మిలాప్ జవేరి అనే సినీ ప్రముఖుడు నిర్మించే పనిలో ఉన్నాడు. అంతర్జాతీయస్థాయిలో ఈ చిత్రం యాక్షన్ ఫిలింగా రూపొందించనున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదిస్తే.. శృంగార సన్నివేశాల్లో నటించే ఉద్దేశం లేదని నో చెప్పేసిందట.

మూడుసార్లు ఫోన్ చేసినా

మూడుసార్లు ఫోన్ చేసినా

పూజా హెగ్డే అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో భారీ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేశారట. అయినా పూజా నుంచి సానుకూలమైన సమాధానం రాలేదట. అంతేకాకుండా మూడుసార్లు కాల్ చేసినా జవాబివ్వకపోవడంతో ఆ ప్రయత్నాన్ని మానుకొన్నారట.

జాన్‌ను తిరస్కరించిన తమన్నా భాటియా

జాన్‌ను తిరస్కరించిన తమన్నా భాటియా

జాన్ అబ్రహం కోసం మిల్కీ బ్యూటీ తమన్నాతో నిర్మాతలు చర్చించారట. అయితే కథ విన్న తర్వాత ఎక్సైటింగ్‌గా ఫీలయిన దాదాపు ఓకే చెప్పేవరకు వచ్చేసిందట. కానీ జాన్ అబ్రహంతో హాట్ హాట్ సీన్లలో నటిస్తే ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుందనే కారణంతో ఆ చిత్రాన్ని తిరస్కరించిందట.

శ్రుతిహాసన్‌తో సంప్రదింపులు

శ్రుతిహాసన్‌తో సంప్రదింపులు

ఇక ఇద్దరి హీరోయిన్లతో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న నిర్మాతలు ప్రస్తుతం శృతిహాసన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే జాన్ అబ్రహంతో నటించడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయనే మాట వినిపిస్తున్నది.

రాకీ హ్యాండ్సమ్‌లో శ్రుతిహాసన్

రాకీ హ్యాండ్సమ్‌లో శ్రుతిహాసన్

ఎందుకంటే శ్రుతి, జాన్ అబ్రహం గతంలో రాకీ హ్యాండ్సమ్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో వారిద్దరూ హాట్ హాట్ సీన్లలో విజృంభించారు. వారిద్దరి కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది.

శ్రుతీ ఓకే చెబుతుందా?

శ్రుతీ ఓకే చెబుతుందా?

రాహ్ చిత్రంలో కూడా భారీగా శృంగార సన్నివేశాలను ప్లాన్ చేశారట. ఒకవేళ శ్రుతిహాసన్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెబితే మళ్లీ ప్రేక్షకులకు తెరమీద కనువిందు కానున్నదట. ఇంతకీ శ్రుతి ఒప్పుకొంటుందా లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది.

English summary
Pooja Hedge, Tamannaah Bhatia rejected John Abhram news become talk of the Bollywood Industry. John Abraham and Manoj Bajpai are all set to star in an action thriller Raah by Milap Zaveri. The movie is being made as an international Action flick, and initially, the makers approached Milky white beauty Tamannaah and Pooja Hegde to play the female lead opposite John Abraham. but these two rejected makes way for Shruti Haasan.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more