»   » కథ కోసం బికినీ వేశా, తప్పేముంది?: పూజా హెగ్డే

కథ కోసం బికినీ వేశా, తప్పేముంది?: పూజా హెగ్డే

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ముకుంద' 'ఒక లైలా కోసం' సినిమాలలో చాల సాంప్రదాయంగా కనిపించిన పూజ హెగ్డే 'డిజే' లో అందరి దృష్టిని ఆకర్షించడానికి బికినీతో మెరుపులు మెరిపించింది. ఒకే ఒక్క స‌రైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ స్లిమ్‌ భామ‌కు.. అనుకోని వ‌రంలా మారింది డీజే. త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవ‌టంలో భాగంగా ఏం చేయ‌టానికైనా సిద్ధ‌మైంది.

ఐరన్ లెగ్ బ్యూటీ

ఐరన్ లెగ్ బ్యూటీ

చివ‌ర‌కు బికినీ షోకు ఓకే చెప్పేసింది. ఈమె నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పటికే ఐరన్ లెగ్ బ్యూటీగా ముద్ర వేయించుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఈ దెబ్బకి ఆ ట్యాగ్ పోగొట్టుకున్నట్టే అంటున్నారు సినీ జనాలు. బికినీ వేయటం టాలీవుడ్ కి కొత్త కాకపోయినా పూజా ని బికినీ లో చూదటం కొత్త విషయమే కదా.

బికినీ

బికినీ

నిజానికి డీజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ ప్రభావం కథ నడిపిన తీరు మీదే తప్ప అటు బన్నీ కి గానీ ఇటు పూజాకి గానీ మైనస్ అవలేదు. అమ్మ‌డి బికినీ అందాలు సెన్సార్ వారు బ్ల‌ర్ చేసినా.. ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని మాత్రం పూజా దోచేసింది. తనమీద ఉన్న ఐరన్ లెగ్ ముద్ర పోగొట్టుకోవటానికి. ‘దువ్వాడ' సినిమాను ఎట్టి పరిస్తితులలోను హిట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈ మూవీలో ఎక్స్ పోజింగ్ కు ఎంత వరకు అవకాశం ఉందో అంత వరకు ఎక్స్ పోజ్ చేస్తూ ఈ మూవీ కోసం పూజ అన్ని విధాల సహకరించింది.

పూజా హెగ్డే ఎక్స్ పోజింగ్

పూజా హెగ్డే ఎక్స్ పోజింగ్

దువ్వాడ జగన్నాథం' మూవీ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో పూజా హెగ్డే ఎక్స్ పోజింగ్ పై చేసిన వ్యాఖ్యలకు ఆ సమావేశానికి వచ్చిన మీడియా వర్గాలకే మైండ్ బ్లాంక్ అయినట్లు టాక్. సెన్సార్ వాళ్లు క‌ట్ చేస్తార‌ని బికినీ వేయ‌కుండా ఉండ‌లేం క‌దా అంటూ.. అందాల ఆర‌బోత విష‌యంలో త‌న‌కెలాంటి అభ్యంత‌రాలు లేవ‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పింది.

దీనిలో తప్పు ఏముంది?

దీనిలో తప్పు ఏముంది?

కథ డిమాండ్ చేసింది కాబట్టి బికినీ వేశాను భవిష్యత్తులో కూడా వేస్తా దీనిలో తప్పు ఏముంది? అంటూ రివర్స్ లో పూజ హేహ్డే వేసిన ప్రశ్నలకు మీడియా ప్రతినిధులు ఆశ్చర్య పోయారు. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా ఈ సినిమాలో పూజ చేసిన ఎక్స్ పోజింగ్ కు మరిన్ని భారీ ఆఫర్స్ రావడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఫ్లాప్ అవటానికి కారణం పూజానే

ఫ్లాప్ అవటానికి కారణం పూజానే

అయితే ఈమె ఐరన్ లెగ్ ముద్రని బన్నీ ఫ్యాన్స్ మాత్రం వదలటం లేదు. అసలు సినిమా ఫ్లాప్ అవటానికి కారణం పూజానే అన్నట్టు గా సోషల్ మీడియాలో ఆమెని దుయ్యబడుతూనే ఉన్నారు. కానీ డీజే నెగెటివ్ టాక్ కి కారణాలు స్పష్తంగా కనిపిస్తూండటం తో పూజా కీ సినిమా కి సరైన బ్రేక్ రాకపోవటానికీ సంబందం లేదు అన్నది మాత్రం అందరికీ అర్థమైన విషయం...

English summary
Pooja Hegde Tollywood Actress Who marked as Iron leg of Tollywood from kannada says About Bikini Scene In Duvvada Jagannadham Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu