»   » ఆ చేదు చిత్రం పూజ హెగ్డేకు పాఠం నేర్పిందట!

ఆ చేదు చిత్రం పూజ హెగ్డేకు పాఠం నేర్పిందట!

Subscribe to Filmibeat Telugu

పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పూజకు అన్నీ బంపర్ ఆఫర్లే వస్తున్నాయి. తెలుగులో చేసిన దువ్వాడ జగన్నాథమ్ చిత్రం తరువాత పూజ హెగ్డే జాతకం మారిపోయింది. ఏకంగా బికినిలో నటించి సంచలనం సృష్టించింది. పూజా సోయగాలు యువత ఆమె జపం చేయడం మొదలు పెట్టారు. పూజా హెగ్డేకి ఉన్న క్రేజ్ ని గుర్తించిన దర్శక నిర్మాతలు స్టార్ హీరోల చిత్రాలకు ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నారు. పూజా ప్రస్తుతం మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ సరసన నటించే అవకాశాలు అంటుకుంటోంది.

ఇప్పడైతే పూజా దశ తిరిగింది కానీ..గతంలో ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల తరువాత టాలీవుడ్ దర్శకులు పూజా హెగ్డేని పట్టించుకోలేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ స్టార్ హీరో హృతిక్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. భారీ ఆశలు పెట్టుకున్న మొహంజదారో చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ చిత్రం తనకు ఓ గుణపాఠం లాంటిది అని పూజా రీసెంట్ గా ఇంటర్వ్యూ లో తెలిపింది. కష్టపడడమే మన చేతుల్లో ఉందని ఆ చిత్రం ద్వారా తెలిసిందని పూజా తెలిపింది. మంచి అవకాశం వస్తే భవిష్యత్తులో బాలీవుడ్ లో నటిస్తానని తెలిపింది.

Pooja Hegde about Mohenjo Daro failure
English summary
Pooja Hegde about Mohenjo Daro failure. It is lesson for me says Pooja
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X