»   » అబ్బాయి హీరోయిన్ తో బాబాయ్ పవన్‌ రొమాన్స్ ?

అబ్బాయి హీరోయిన్ తో బాబాయ్ పవన్‌ రొమాన్స్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కొన్ని వార్తలు వినటానికి క్యాజువల్ గా ఉన్నా... ఆ న్యూస్ ని మరో యాంగిల్ లోంచి చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోయిన్ విషయంలో అలాగే ఉంది. ఆయన సరసన నటించబోయే హీరోయిన్ అంతకు ముందు పవన్ అన్న నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తో చేసింది.

Pooja Hegde roped in for Pawan Kalyan, Trivikram's next film

పూర్తి వివరాల్లోకి వెళితే.. పవన్‌కల్యాణ్‌.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. త్రివిక్రమ్‌, పవన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని కీర్తి సురేష్‌ ట్వీట్‌ చేసి, ఆమె విషయాన్ని ఖరారు చేసారు.

ఇలా మాట్లాడటానికి సిగ్గపనించలేదూ? :పవన్ హీరోయిన్ కు ప్రస్టేషన్ లో..మరో హీరోయిన్ పై

తాజాగా మరో హీరోయిన్ పూజా హెగ్డే సీన్ లోకి వచ్చింది. ఆమె కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్యతో 'ఒకలైలా కోసం', వరుణ్ తేజ 'ముకుంద' చిత్రాలతో అలరించిన పూజా ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన 'దువ్వాడ జగన్నాథమ్‌' చిత్రంలో నటిస్తోంది.

English summary
The search for female leads for Pawan Kalyan and Trivikram’s next film finally comes to an end. Pooja Hegde has been roped in to work along with Keerthy Suresh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu