»   » వావ్ సూపర్బ్: పూజా హెడ్గే ‘మొహంజో దారో’ లుక్ (ఫోటో)

వావ్ సూపర్బ్: పూజా హెడ్గే ‘మొహంజో దారో’ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న సినిమా 'మొహెంజోదారో'. బెంగుళూరు బ్యూటీ పూజా హెడ్గే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈచిత్ర హీరోయిన్ పూజా హెడ్గేకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసారు. ఆ కాలం నాటి స్టైల్ తో పూజా హెడ్గే ఎంతో అందంగా, సెక్సీగా కనిపిస్తోంది. సౌత్ లో కేవలం రెండు మూడు సినిమాలకు మించి అనుభవం లేని పూజా హెడ్గేను ఎందుకు తీసుకున్నారో తాజాగా విడుదలైన లుక్ తో స్పష్టమైంది. ఆమె అందానికి సరిపడ పాత్ర కాబట్టే ఆమెను ఎంచుకున్నారు. ఇందులో ఆమె 'చాని' అనే పాత్రలో కనిపించబోతోంది. ఈ లుక్ విడుదలైన తర్వాత అందరి దృష్టి పూజా వైపు మళ్లింది. త్వరలోనే ఆమె బాలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు.

pooja hedge

హృతిక్ రోషన్ కెరీర్లోనే 'మొహంజోదారో' అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్....ఆడియో-శాటిలైట్ హక్కులు ఇప్పటికే రూ. 60 కోట్లకు అమ్ముడు పోయాయి అంటే సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రీ రిలీజ్ బిజినెస్ 200కోట్లకుపైగా జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతితెలిసిందే. ఒక నిమిషయం నిడివిగల ఈ మోషన్ పోస్ట్ సినిమాలో ఏం చూపించబోతున్నారో ఒక్క ముక్కలో చెప్పేసారు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఒక అద్భుతమైన చరిత్ర ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని స్పష్టమవుతోంది.

బ్రిటిష్ పాలనకటే ముందు, మొగలాయిల కంటే ముందు, క్రీస్తు కంటే ముందు, అలెగ్జాండర్ రాక కంటే ముందు, బుద్దుడి కంటే ముందు....ఇండియాలో మొహంజోదారో నాగరికత విలసిల్లిన సంగతి తెలిసిందే. ఇదే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మోషన్ పోస్టర్ చివర్లో ఆకాలం నాటి ఒక నాణెం. అప్పటి బొమ్మలిపి చూపించారు.

ఇప్పటి వరకు ఇంతలోతైన చరిత్రను ఇండియన్ సినిమాలో ఎవరూ చూపించలేదు. మరి దర్శకుడు తెరపై ఈ చిత్రను ఏ విధంగా ఆవిష్కరించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. చరిత్ర కారులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 12న ఈ సినిమా విడుదలవుతోంది.

English summary
Model-turned-actress Pooja Hegde has shared the first look of her character Chaani from her Bollywood debut Mohenjo Daro. The epic adventure-romance film has been directed by Ashutosh Gowariker and also stars Hrithik Roshan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu