Don't Miss!
- News
చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం: ఎలాగో వివరించిన మంత్రి రోజా..!!
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్‌సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Most Eligible Bachelor.. పూజా హెగ్డే గ్లామర్ క్వీన్‌గా.. ఇద్దరిపైనే అందరి దృష్టి
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్2 (జీఏ2) బ్యానర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రానికి బన్నీవాసు, వాసు వర్మ నిర్మాతలు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంపై ఇప్పటికే ఓ రకమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించిన విశేషాలు మీ కోసం...

ఎన్నారైగా అఖిల్.. స్టాండప్ కమెడియన్ పూజా
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా విషయానికి వస్తే.. హర్ష (అఖిల్) ఎన్నారై యువకుడు. విభ (పూజా హెగ్డే) స్టాండప్ కమెడియన్. పెళ్లిచూపుల కోసం వచ్చిన అఖిల్ చివరకు విభతో ప్రేమలో పడుతాడు. వారిద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ ఈ సినిమా కథగా చెప్పుకొంటున్నారు. ప్రస్తుత నాగరిక ప్రపంచంలోని యువతకు ఓ సందేశం ఇచ్చే దిశగా సినిమాను రూపొందించినట్టు దర్శకుడు భాస్కర్ తెలిపారు.

సినిమా కష్టాలతో షూటింగ్ పూర్తి
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా 2019 జూలైలో ప్రారంభమైంది. ఈ సినిమా కీలక సన్నివేశాలను జనవరి 2020లో అమెరికాలో షూట్ చేశారు. ఆ త్వాత మార్చిలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించారు. అయితే కరోనావైరస్ విజృంభించడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2020లో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టి షూటింగ్ పూర్తి చేశారు.

పలుమార్లు రిలీజ్ వాయిదా
అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను ఫస్ట్ లాక్‌డౌన్ తర్వాత రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే మళ్లీ కరోనావైరస్ విజృంభించడంతో సినిమా రిలీజ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. అలా వాయిదాలు పడుతూ చివరికి దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది.

100కుపైగా నటీనటులు, మోడల్స్‌తో
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో దాదాపు 100కుపైగా నటీనటులు, మోడల్స్ నటించారు. ఇషా రెబ్బా, చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ అతిథి పాత్రలో కనిపించారు. ఇంకా ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాశ్, ప్రగతి, అమిత్ తివారీ, సుడిగాలి సుధీర్ నటించారు.

బొమ్మరిల్లు భాస్కర్‌కు కీలకంగా
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి సంబంధించి అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్‌కు ఇది అగ్నిపరీక్షే అని చెప్పవచ్చు. వరుస ఫ్లాపులతో వీరిద్దరు నిలదొక్కుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ కావడం భాస్కర్, అఖిల్‌కు అత్యవసరం. వీరి జాతకం ఈ సినిమా ద్వారా వెల్లడయ్యే అవకాశం ఉంది.

పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్
ఇక గోపి సుందర్ అందించిన పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. లహరాయి పాట మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత గుచ్చె గులాబీ, మనసా మనసా, చిట్టి అడుగు పాటలు మంచి ఆదరణను చూరగొన్నాయి. ఈ సినిమా తెరపైన ఎలాంటి ప్రతిస్పందనను కూడగట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.
Recommended Video

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు:
అఖిల్
అక్కినేని,
పూజా
హెగ్డే,
ఈషారెబ్బా,
ఫరీదాఅబ్దుల్లా,
చిన్మయి
శ్రీపాద,
రాహుల్
రవీంద్రన్,
ఆమని,
మురళీ
శర్మ,
వెన్నెల
కిషోర్,
జయప్రకాశ్,
ప్రగతి,
అమిత్
తివారీ,
సుడిగాలి
సుధీర్
తదితరులు
రచయిత,
దర్శకుడు:
బొమ్మరిల్లు
భాస్కర్
నిర్మాతలు:
బన్నీ
వాసు,
వాసు
వర్మ
సినిమాటోగ్రఫి:
ప్రదీప్
వర్మ
ఎడిటింగ్:
మార్తాండ్
కే
వెంకటేష్
మ్యూజిక్:
గోపి
సుందరం
బ్యానర్:
జీఏ2
పిక్చర్స్
రిలీజ్:
2021-10-15