»   » హాట్ మోడల్‌పై అత్యాచారం, తెర వెనక సోనాక్షి సిన్హా?

హాట్ మోడల్‌పై అత్యాచారం, తెర వెనక సోనాక్షి సిన్హా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి, మోడల్, బిగ్ బాస్-5 కంటెస్టెంట్ పూజా మిశ్రా తనపై లైంగిక దాడి జరిగిదంటూ ఉదయ్ పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే దాడికి పాల్పడింది ఎవరో తనకు తెలియదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వీరిని తనపైకి లైంగిక దాడికి ప్రేపించింది సోనాక్షి సిన్హా, ఆమె తల్లి పూనం, ఇషా కొపీకర్, వేణుగోపాల్ దూత్ అయి ఉండొచ్చని తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

ఫోటో షూట్ క్యాలెండర్ కు సంబంధించి తాను ఉదయ్ పూర్ లోని ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసింది. ‘డిన్నర్ తర్వాత డ్రింక్ తాగాను. తర్వాత మైకం కమ్మి నిద్రపోయాను. నిద్ర లేచిన తర్వాత లైంగిక దాడికి గురైనట్లు తెలిసింది' అంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూజా మిశ్రా ఫిర్యాదు స్వీకరించి సెక్షన్ 354, 379 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వైద్య పరీక్షలకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

పూజా మిశ్రా గురించి వివరాలు స్లైడ్ షోలో....

పూజా మిశ్రా

పూజా మిశ్రా


2002లో ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన పూజా మిశ్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.

మోడలింగ్ రంగంలో..

మోడలింగ్ రంగంలో..


కెరీర్ తొలినాళ్లలో పూజా మిశ్రా మోడలింగ్ రంగంలో రాణించింది. అందచందాలతో ఆకట్టుకుంది.

వివిధ బ్రాండ్ల తరుపున ప్రచారం

వివిధ బ్రాండ్ల తరుపున ప్రచారం


మోడలింగ్ చేసేప్పుడు వీడియోకాన్, ఫ్రూటి, రాయల్ పామ్స్, ఇండియ్ ఎక్స్ ప్రెస్, సన్ సూయ్, లిస్సమ్ మాయిశ్చరైజర్ తరుపున ప్రచారం చేసింది.

వివిధ మేగజైన్లపై...

వివిధ మేగజైన్లపై...


గతంలో పూజా మిశ్రా సినీ బ్లిట్జ్, హెల్త్, యూత్ ఐ, కస్మో పాలిటన్; ఎల్లె, ఫెమినా లాంటి మేగజైన్ల కోసం అందాలు ఆరబోసింది.

టీవీ కార్యక్రమాల్లో...

టీవీ కార్యక్రమాల్లో...


యూటీవీ బిందాస్, కలర్స్, లైఫ్ ఓకే చానల్స్‌లో ప్రసారం అయిన వివిధ కార్యక్రమాల్లో నటించింది, యాంకరింగ్ చేసింది.

బిగ్ బాస్

బిగ్ బాస్


ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5లో కూడా పూజా మిశ్రా నటించింది.

సినిమాల్లో...

సినిమాల్లో...


2003లో వచ్చిన దిల్ కా రిస్తా సినిమాలో ఐటం గర్ల్‌గా పూజా మిశ్రా బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘బాజా బజాదూంగా', ‘లవ్ ది వే ఐ యామ్' చిత్రాల్లో ఐటం సాంగులు చేసింది.

English summary
Big Boss 5 contestant Pooja Mishra on Wednesday filed molestation charges against unidentified people in Udaipur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu