»   » సన్నీ లియోన్ పరువుతీసిందంటూ...రూ. 100 కోట్ల దావా!

సన్నీ లియోన్ పరువుతీసిందంటూ...రూ. 100 కోట్ల దావా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్ని లియోన్ మీద మాజీ బిగ్ బాస్-5 కంటెస్టెంట్, మోడల్ పూజా మిశ్రా బాంబే హైకోర్టులో రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. సన్నీ లియోన్ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించిందని, ఆమె మూలంగా తాను ఆర్థికంగా నష్టపోయాను...తనకు రూ. 100 కోట్లు చెల్లించాలని తన పిటీషన్లో డిమాండ్ చేసింది.

పూజా మిశ్రా పిటీషన్ స్వీకరించిన జస్టిస్ నరేష్ పాటిల్ నేతృత్వంలోని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటీషన్ పై విచారణను వేసవి సెలవుల తదుపరికి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ వాదనలు వినే సమయంలో పిటీషనర్ కోర్టుకు హాజరు కాలేదు.

Pooja Mishra is Suing Sunny Leone For 100 Crores in Defamation Lawsuit

పూజా మిశ్రా తన పిటీషన్లో.... బిగ్ బాస్-5లో మొదట తానే పాపులర్ పోటీదారునని, షో ప్రారంభమైన చాలా రోజులకు సన్నీ లియోన్ ఈ కార్యక్రమంలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు. ఆ సమయంలో సన్నీ లియోన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన పరువుకు నష్టం కలిగించే విధంగా మాట్లాడిందని పేర్కొన్నారు. తనకు దురుద్దేశాలు ఆపాదిస్తూ ఆరోపణలు చేసిందని తెలిపారు.

సన్నీ లియోన్ చర్య వల్ల తన గౌరవప్రతిష్టలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, ఈ పరిణామాల క్రమంలో తన ఫిక్స్డ్ డిపాజిట్ష్, బ్యాంకు సేవింగ్స్ విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చిందని... ఈ కారణంగా తాను రూ. 70 లక్షల వరకు నష్టపోయాను అని పూజా మిశ్రా తన పిటీషన్లో పేర్కొన్నారు. సన్నీ లియోన్ మీద ఐపిసి సెక్షన్ 500(డిఫామేషన్), 120 బి(కుట్ర) అభియోగాలతో తగిన చర్యలు తీసుకోవాలని పూజా మిశ్రా తన పిటీషన్లో పేర్కొన్నారు.

English summary
Big Boss season 5 contestant and model Pooja Mishra has slapped a case against actress Sunny Leone in the Bombay High Court demanding Rs 100 crore compensation for allegedly "defaming her".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu