»   » ఇచ్చిన మాట తప్పని ప్రభాస్ ..ఈ రోజే కొత్త చిత్రం లాంచ్

ఇచ్చిన మాట తప్పని ప్రభాస్ ..ఈ రోజే కొత్త చిత్రం లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఘన విజయం సాధించిన 'బాహుబలి' చిత్రంలో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్‌ తదుపరి చిత్రం ఏ గొప్ప ఫిల్మ్‌ మేకర్‌ చేతికి వెళుతుందో అని అంతా భావించారు. కాని ప్రభాస్‌ అందరికి ఆశ్చర్యపరుస్తూ 'రన్‌ రాజా రన్‌' ఫేం దర్శకుడు సుజీత్‌కి ఈ అవకాశం ఇచ్చాడు.

మరో ప్రక్క 'బాహుబలి' చిత్రంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిన ప్రభాస్‌ తన తదుపరి చిత్రాలను బాలీవుడ్‌లో చేయనున్నాడు, సుజీత్ తో అనుకున్న ప్రాజెక్టు కాన్సిల్ అయినట్లే అని వార్తలు వచ్చాయి. కాని లాంటిది ఏం జరగకుండా సుజీత్‌తోనే ముందుకు వెళ్తున్నాడు. అమాంతం పెరిగిన తన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఆలోచించకుండా, ఇచ్చిన మాట తప్పకుండా సుజీత్ తో ముందుకు వెళ్లటం గొప్ప విషయం.

Pooja for Prabhas - Sujith's film today

అది ప్రక్కన పెట్టి ప్రస్తుత విషయానికి వస్తే... రెండేళ్లుగా సాగుతున్న 'బాహుబలి' షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం కోసం తయారవుతున్న సంగతి తెలిసిందే. 'రన్ రాజా రన్' చిత్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. ఈ యువ దర్శకుడు ప్రభాస్ ని ఒక కొత్త లుక్ లో చూపించడానికి తగ్గ కధని ఎంచుకున్నాడు. ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం చాలా కాలం నుండి ఈ ప్రాజెక్ట్ మీదే కష్టపడుతూ మంచి స్క్రిప్ట్ ను తయారు చేసుకున్నాడు.

'బాహుబలి 2' షూట్ పూర్తై ప్రభాస్ కు కాస్త విశ్రాంతి కూడా దొరకడంతో ప్రభాస్, సుజీత్ ఇద్దరూ చర్చలు జరిపి సినిమాను ఇక లాంచ్ చేస్తే బాగుంటుందని నిర్ణయానికొచ్చారు. ఆ లాంచింగ్ కు ఈ రోజు 13వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ప్రత్యేక అతిధుల మధ్య పూజా కార్యక్రమాలతో ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ విషయాన్ని సుజీత్ స్వయంగా ప్రకటించారు. సుజీత్‌ రేపు ప్రభాస్‌ తదుపరి చిత్రం లాంఛ్‌ చేయనున్నామని ప్రకటించగానే బాహుబలి ప్రభాస్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తెరకెక్కించడానికి సుజీత్‌ ఎప్పటి నుండో ప్రణాళిక రచిస్తున్న విషయం తెల్సిందే.

English summary
Pooja ceremony for Prabhas's next film will be held today (Feb 13). The film will commence its regular shoot two months later. Sujith of 'Run Raja Run' fame will be directing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu