»   »  షూటింగులో హీరోయిన్ పూనమ్ కౌర్‌కు గాయాలు!

షూటింగులో హీరోయిన్ పూనమ్ కౌర్‌కు గాయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Poonam Kaur
హైదరాబాద్: హీరోయిన్ పూనమ్ కౌర్ షూటింగులో గాయపడింది. ఆచరమ్ అనే తమిళ షూటింగులో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇవి చిన్నపాటి గాయాలే అని యూనిట్ సభ్యులు తెలిపారు.

కొడైకనాల్‌లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సంఘటనపై పూనమ్ కౌర్ స్పందిస్తూ...'షూటింగ్ జరుగుతుండగా కింద పడిపోయాను. కుడివైపు దవడకు గాయమైంది. అదే విధంగా కుడి కాలు కొంత గీసుకుపోయింది' అని పూనమ్ కౌర్ తెలిపారు.

'దవడకు గాయం కావడం వల్ల ఫ్రీగా మాట్లాడలేక పోతున్నాను. దవడ లోపలివైపు వాపు వచ్చింది. అదృష్ట వశాత్తు అదే రోజు షూటింగ్ చివరి రోజు. గాయపడిన సందర్భంలో తీసిన సన్నివేశం ఇప్పటికే తీసినా బెటర్‌గా రావాలని మళ్లీ ట్రై చేసాం. ఈ క్రమంలోనే గాయమైంది అని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

'ఈ గాయం కారణంగా నేను షూటింగులో పాల్గొనడం ఆపదలుచుకోలేదు. సాంగు చిత్రీకరణలో పాల్గొంటాను. ఈ పాట పూర్తయితే మొత్తం షూటింగ్ పూర్తవుతుంది' అని ఆమె తెలపారు. ఈ చిత్రంలో పూనమ్ కౌర్‌కు జోడీగా గణేష్ వెంట్రామన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో పూనమ్ కౌర్ నటిస్తోంది.

English summary
Actress Poonam Kaur was injured while shooting for her Tamil film Aacharam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu