»   » ఆమె బరితెగించినా పట్టించుకోరేం : హీరోయిన్ ఫైర్

ఆమె బరితెగించినా పట్టించుకోరేం : హీరోయిన్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : 'నషా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసిన సంచలన మోడల్ పూనమ్ పాండే ఆ సినిమాలో హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసిన సంగతి తెలిసిందే. అందాల ఆరబోతతో పూనమ్ శృతి మించుతోదంటూ ఇటీవల ముంబై, ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆమె పోస్టర్లు కూడా తగులబెట్టారు.

ఈ నేపథ్యంలో పూనమ్ పాండే ఆందోళన కారులపై విరుచుకుపడిందట. 'సన్నీ లియోన్ లాంటి ఫోర్న్ స్టార్స్ ఇండియాకి వచ్చి బాలీవుడ్ చిత్రాల్లో బరితెగించి అన్నీ విప్పేసి నటిస్తున్నా ఎవరూ పట్టించుకోరు. కానీ నా ఫోటోలు మాత్రం తగులబెడుతున్నారు. నేనేమీ చట్టవ్యతిరేక పనులు చేయలేదు. సెన్సార్ పరిధికి లోబడే అందాలు ఆరబోసి నటించాను' అని ఘాటుగా వ్యాఖ్యానించిందట.

తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని, సొంత టాలెంటుతో ఈ స్థాయికి ఎదిగానని, నేను ఏ తప్పూ చేయలేదు...ఎవరికీ భయపడను అంటోంది పూనమ్. అయినా తనను సన్నీ లియోన్ లాంటి వారితో పోల్చవద్దని అంటోంది. మిగతా వివరాలు స్లైడ్ షోలో...

నషా ఓపెనింగ్స్

నషా ఓపెనింగ్స్

పూనమ్ పాండే నటించిన ‘నషా' మూవీ ఇటీవల విడుదలైంది. సినిమాకు పబ్లిసిటీ పెంచడానికి రకరకాల గిమ్మిక్కులు ప్రదర్శించింది. తన గ్లామర్‍‌తో పూనమ్ చేసిన ప్రయోగాలు బాగానే వర్కౌట్ అయ్యాయి. సినిమా ఓపెనింగ్స్ సంతృప్తి కరంగానే ఉన్నాయి.

నిర్మాతలకు లాభమే

నిర్మాతలకు లాభమే

నషా' చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భాటియా నిర్మించారు. అమిత్ సక్సేనా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో అమిత్ సక్సేనా భట్ క్యాంపు నుంచి వచ్చిన ‘జిస్మ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్మ్ సినిమా అప్పట్లో ఓ శృంగార సంచలనం. నషా చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో నిర్మించారు. పెట్టుబడి తిరిగి రావడంతో పాటు కాస్తోకూస్తో లాభాలు వచ్చాయట.

స్కిన్‌షో సమర్థించుకుంటోంది

స్కిన్‌షో సమర్థించుకుంటోంది

పూనమ్ స్కిన్ షోను సమర్థించుకుంటోంది. తాను చిన్ని చిన్న దుస్తులు వేసుకుని ఎక్స్ ఫోజింగ్ చేయడాన్ని తప్పుగా భావించడం లేదని, ఇది కూడా ఒక రకంగా సమాజ సేవ అని అంటోంది. నన్ను ఇలాంటి డ్రెస్సుల్లో చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ సోషల్ సర్వీసే అని వాదిస్తోంది పూనమ్.

పూనమ్ పాపులారిటీ పని చేసింది

పూనమ్ పాపులారిటీ పని చేసింది

పద్దెనిమిదేళ్ల యువకుడు, ఇరవై ఐదేళ్ల యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. పూనమ్ పాండే పలు సీన్లలో గ్లామరస్‌గా నటించడంతోపాటు పడకగది శృంగార సీన్లలో ఇరగదీసినట్లు ఈ ట్రైలర్లో చూపించడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

హర్టయిన పూనమ్

హర్టయిన పూనమ్

తనను సన్నీ లియోన్ లాంటి విదేశీ ఫోర్న్ స్టార్స్‌తో పోల్చడంపై పూనమ్ పాండే హర్టయింది. అలాంటి వ్యక్తులతో తనను పోల్చ వద్దని.....ఆమెలా తాను తప్పుడు చిత్రాల్లో నటించలేదని, బాలీవుడ్ సినిమాల్లో నటించానని అంటోంది.

English summary
Poonam Pandey has said that she cannot be compared to former porn star Sunny Leone. "I don't even like the comparisons being drawn to Sunny Leone. Nasha has dialogues; it's not all oohs and aahs. [Nasha] is about when you cross the limits."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu