»   » థియేటర్లో టిక్కెట్లు అమ్ముతున్న సెక్స్ బాంబ్

థియేటర్లో టిక్కెట్లు అమ్ముతున్న సెక్స్ బాంబ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మైసూరు: టిక్కెట్ తీసుకోవటానికి ధియోటర్ కి వెళితే అక్కడ కౌంటర్లో మీ అభిమాన తార కనిపిస్తే...ఎలా ఉంటుంది. అది నిజం చేయాలనే పూనమ్ పాండే నిర్ణయించుకుంది. తను ఐటం సాంగ్ చేసిన చిత్రం ప్రమోషన్ కోసం థియోటర్ కి వెళ్లి మరీ టిక్కెట్లు అమ్మబోతోంది. బెంగళూరులోని మెయిన్ థియోటర్ ని అందుకోసం ఎంపిక చేసారు. ఈ విషయాన్ని చిత్రం యూనిట్ మీడియాకు తెలియచేసింది. ఆ రోజు ఆ థియోటర్ దగ్గర ఓపినింగ్స్ అదిరిపోతాయన్నమాట. మరి తెలుగులో కూడా ఎవరన్నా ఇలాంటి ప్రయోగం చేస్తే బావుంటుందేమో.

ప్రముఖ నటి పూనంపాండే నగరానికి వచ్చారు. రాత్రి ముంబయి నుంచి బెంగళూరు చేరుకున్న ఆమె ఉదయం రాచనగరికి వచ్చారు. ఉదయాన్నే చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తూ మేడమీద నుంచి పడి దుర్మరణం చెందిన లవ్‌ఈజ్‌ పాయిజన్‌ సినిమా హీరో రాజేష్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సినిమాలో పూనం పాండే ఓ ప్రత్యేక పాటలో నటించింది.

Poonam Pandey wants to sell tickets

సినిమా ఈనెల 20న విడుదల కానుంది. సినిమా ప్రచారం కోసమే ఆమె బెంగళూరు వచ్చినట్లు తెలిసింది. విడుదల రోజున బెంగళూరులోని ఓ థియేటర్‌లో ఆమె కౌంటర్‌లో కూర్చుని టిక్కెట్లను విక్రయించనుంది. అనంతరం హుబ్లి, హావేరి, తుమకూరు ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని రాజేష్‌ కుటుంబానికి అందచేయనున్నట్లు నిర్మాత కేశవమూర్తి తెలిపారు.

English summary
Poonam Pandey prayed for the success of her upcoming film ‘Love is Poison’ at Chamundeshwari Temple in Mysore, on June 18.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu