»   » పూరీ జగన్నాధ్ ప్లాఫ్ హీరోయిన్ రేటు 5 కోట్లు

పూరీ జగన్నాధ్ ప్లాఫ్ హీరోయిన్ రేటు 5 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్...ప్రభాస్ తో చేసిన ఏక్ నిరంజన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేసిన కంగనా రౌనత్ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా రెమ్యునేషన్ ఐదు కోట్లు తీసుకుని సంచలనం సృష్టించింది. కేంద్ర మంత్రిగా చేసిన రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాంగ్ పాస్వాన్ హీరోగా పరిచయమవుతూ చేస్తున్న కొత్త చిత్రం కోసం ఈ ఎగ్రిమెంటు జరిగింది. తన కుమారుడు బాలీవుడ్ ఎంట్రీ కోసం రామ్ విలాస్ పాశ్వాన్ ఎంతయినా ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కొత్త హీరో ప్రక్కన నేను నటించను అని కంగనా అనేసరికి ఈ భారీ మొత్తాన్ని ఆమెకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు తన్వీర్ ఖాన్. అలాగే ఈ చిత్రాన్ని మార్విక్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. వెనక నుంచి పాశ్వాన్ డబ్బు సాయిం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో ఐశ్వర్య రాయ్ తీసుకుంటున్న ఐదు కోట్ల గీతను కంగనా రీచ్ అయింది. ఇక కంగనా తెలుగులో ఆ ఏక్ నిరంజన్ తర్వత ఆశలు పెట్టుకుంది కానీ...ఆఫర్స్ ఏమీ రాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu