twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా ప్లాప్ అయితే డబ్బులొద్దన్నారు: హరికృష్ణ మరణంపై పోసాని

    By Bojja Kumar
    |

    Recommended Video

    నందమూరి హరికృష్ణ మరణంపై పోసాని కృష్ణ మురళి స్పందన

    నందమూరి హరికృష్ణ మరణంపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందంటూ... ఆయనతో కలిసి పని చేసిన రోజులను పోసాని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ తనకు 25 ఏళ్లుగా తెలుసని చెప్పిన పోసాని.... ఆయన ఎంతో మంచి వ్యక్తి అని, ఒకరిని మోసం చేయడం, నాశనం చేయాలన్న ఆలోచన కూడా ఆయనలో ఎప్పుడూ చూడలేదన్నారు. అందరూ బావుండాలని కోరుకునే వ్యక్తి అని చెప్పుకొచ్చారు.

    ఆయన సినిమాలకు కథలు రాశాను

    ఆయన సినిమాలకు కథలు రాశాను

    హరికృష్ణ 10 సినిమాల్లో నటిస్తే అందులో 8 సినిమాలకు తాను కథ, కథనం అందించానని ఈ సందర్భంగా పోసాని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాను పనిమీద గోవాకు వచ్చి ఇరుక్కున్నానని, లేదంటే హరిని చూసేందుకు వెంటనే వెళ్లేవాడినన్నారు.

    ఆయనకు బాకీ పడ్డా, డబ్బులొద్దన్నారు

    ఆయనకు బాకీ పడ్డా, డబ్బులొద్దన్నారు

    ‘శ్రావణ మాసం' సినిమాకు హరికృష్ణకు తాను రూ.2 లక్షలు బాకీ పడ్డానని, సినిమా విడుదలైన తర్వాత ఆయన ఇంటికి వెళితే ‘ఏమోయ్.. డబ్బులు ఎప్పుడు ఇస్తావ్?' అని అడిగారు, అన్నా... సినిమా ప్లాపయింది, నెలరోజుల్లో ఇచ్చేస్తాను అనగానే... ‘డబ్బులొద్దు... ఓ పార్టీ ఇచ్చేయ్' అన్నారని పోసాని గుర్తు చేసుకున్నారు.

    వ్యక్తిత్వంలో తండ్రిని మించిపోయాడు

    వ్యక్తిత్వంలో తండ్రిని మించిపోయాడు

    వ్యక్తిత్వంలో ఆయన తండ్రి ఎన్టీఆర్ కంటే గొప్ప వ్యక్తి అని చెప్పిన పోసాని... సినిమాల్లో నటించే రోజుల్లో 8 గంటలకు ఉంటే ఆయన ఆరు గంటలకు వచ్చేవారని అన్నారు.

     ప్రేమగా పిలుస్తారు

    ప్రేమగా పిలుస్తారు

    తనను పోసాని అంటూ... హరికృష్ణ ప్రేమగా పిలిచేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన ఇలా అందరినీ విడిచి వెళ్లడం ఎంతో బాధాకరమైన విషయమన్నారు.

    English summary
    Posani Krishna Murali about Harikrishna death. Nandamuri Harikrishna died in a road mishap near Nalgonda in Telangana on Wednesday morning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X