»   » సిగ్గంటే తెలియదు: నేను కమ్మోడిని, చిరు పంపాడని చెప్పా అంతే...

సిగ్గంటే తెలియదు: నేను కమ్మోడిని, చిరు పంపాడని చెప్పా అంతే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పోసాని కృష్ణ మురళి.... తెలుగు సినీ పరిశ్రమలో డైలాగ్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి... కథా రచయితగా, స్క్రీన్ రైటర్ గా, ఆపై దర్శకుడిగా.... ఇపుడు విజయవంతమైన నటుడిగా దూసుకెలుతున్న మల్టీటాలెంటెడ్ పర్సన్. ఇతరులకంటే భిన్నంగా ఉండటం, భిన్నంగా మాట్లాడటమే ఆయన ప్రత్యేకత.

పోసాని భిన్నంగా ఉండటం సినిమాల్లో వర్కౌట్ అయింది కానీ రాజకీయాల్లోకి వర్కౌట్ కాలేదు. ఎంతో నిజాయితీగా ఉండే ఆయన రాజకీయాల్లో ఇమడలేక పోయారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఓటీవీ ఛానల్ షోలో పాల్గొన్న ఆయన ఈ విషయమై మాట్లాడుతూ ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.

'నేను పోసాని కృష్ణమురళి, నేను కమ్మోడిని, తనను చిరంజీవి పంపించాడు గెలిపించండి' అని ప్రజలను అడిగానని అన్నాడు. గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తా, అంతే కానీ డబ్బులు ఖర్చుపెట్టను అని ప్రజలకు చెప్పాను అది నచ్చలేదు. అందుకే ఓడించారని పోసాని తెలిపాడు. అయినప్పటికీ తనకు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఆయన అన్నాడు. తరువాత రాజకీయాలు తనకు నప్పవని తరువాత అర్థమైందని పోసాని కృష్ణమురళి చెప్పాడు.

ఏ విషయాన్ని అయినా తాను మొహమాటం లేకుండా చెబతాను. నిజాయితీగా మాట్లాడతాను. సిగ్గుపడటం నాకు తెలియదు. మొడిమొలతో పరిగెత్తమన్నా సిగ్గులేకుండా పరుగెడతానని చెప్పాడు. నటుడిగా మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తన కలాన్ని పక్కన పెట్టినట్లు తెలిపారు.

English summary
Tollywood actor Posani Krishna Murali comments about politics and movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu