»   »  ధారాసింగ్ గా రానున్న పోసాని

ధారాసింగ్ గా రానున్న పోసాని

Posted By:
Subscribe to Filmibeat Telugu

పోసాని కృష్ణమురళి, శ్రీహర్ష, శ్రావణి ప్రధాన పాత్ర ధారులుగా రాజేష్‌ పుప్పాల దర్శకత్వంలో లచ్చురామ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై అంగోతు రాజునాయక్‌ నిర్మిస్తున్న సినిమా 'ధారాసింగ్‌'.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నాం. బడ్జెట్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దర్శకుడు రాజేష్‌ కథ చెప్పిన దానికంటే అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తున్నారు. మా బ్యానర్‌లో వస్తున్న రెండో చిత్రమిది.

Posani krishna murali dhara singh photos

మొదటి చిత్రంగా 'దమ్మున్నోడు'ని తీశాం. అది మంచి హిట్‌ అయ్యింది. అలాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. వైజాగ్‌, అరకు వంటి అందమైన ప్రాంతాలలో షూటింగ్‌ జరిపాం. ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరులో విడుదల చేస్తున్నాం' అని అన్నారు.

Posani krishna murali dhara singh photos

దర్శకుడు మాట్లాడుతూ, 'నిర్మాత సహకారం మరువలేనిది. ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ చాలా కొత్తగా ఉంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది' అని చెప్పారు. ఈ చిత్రానికి బోలే సంగీతం అందిస్తూందగా, శ్రీశ్రీ, రాజు అనపర్తి లు పాటలు అందించారు.

English summary
Posani Krishna Murali playing a role as Dhara Singh
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu