»   » పోసానిపై బూతు మెసేజ్ ల దాడి: పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

పోసానిపై బూతు మెసేజ్ ల దాడి: పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెల్ ఫోన్ లో అసభ్యకర మెసేజ్ లు ఇప్పటి వరకూ ఆడవాళ్ళకూ,మహిళా సెలబ్రిటీలకూ మాత్రమే ఉంటాయని అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు మగ నటులకూ ఇదే తరహా వేదింపులు మొదలయ్యాయి. తాజాగా టాలీవుడ్ ఫైర్ స్టార్ గా పిలుచుకునే పోసాని క్రృష్ణ మురళి కీ ఈ తరహా వేదింపులే ఎదురయ్యాయి.

అయితే ఆ వేదిపులు కూడా అమ్మాయినించయితే బాగానే ఉందేది. వ్సహాయం కోసం వచ్చిన ఒక వ్యక్తి పోసాని డబ్బులివ్వటానికి నిరాకరించాడనే కోపంతో బూతు మెసేజ్ లు పంపటం మొదలు పెట్టాడట... ఇంతకీ సంగతేంటంటే

తన సెల్‌ఫోన్‌కి అసభ్యకర మెస్సేజ్‌లు పంపిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని సినీ నటుడు పోసాని కృష్ణమురళి శుక్రవారం ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడకు చెందిన నరేశ్ (35) అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఎల్లారెడ్డిగూడలోని పోసాని నివాసానికి వచ్చాడు.

Posani Krishna Murali Gets Abusing Calls

తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాననీ పోసాని మామూలుగా ఎందరో పేదలకు ఆర్థికసాయం అందిస్తుంటారు కాబట్టి తనకూ కొంత ఆర్థికంగా సాయం చేయమనీ అడిగాడట అయితే... పోసాని అందుకు నిరాకరించాడు తాగుడుకు బానిసై న నీకు డబ్బులు ఇవ్వలేనూ నిజంగా నీకు ఆర్థిక ఇబ్బందులే ఉంటే నువ్వు పని చేయలేని వాడివి అయి ఉంటే డబ్బులు ఇవ్వగలను కానీ నీకు ఇవ్వలేను అని చెప్పి పంపించి వేసాడట..

తాను అడిగితే సహాయం చేయలేదనే కోపంతో పోసాని సెల్‌ఫోన్‌కు నరేశ్ రోజూ అసభ్యకర భాషలో తిడుతూ మెస్సేజ్‌లు పంపిస్తున్నాడు. ఒకటిరెండు సార్లు చెప్పి ఇక ఆ మెసేజ్ లని భరించలేక విసిగిపోయిన పోసాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీత బాదలు పీతవీ.., సీత భాదలు సీతవీ అన్నట్టు... సెలబ్రిటీల బాదలు సెలబ్రిటీలవి

English summary
Posani Krishna Murali files complaint after getting abusive calls
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu