»   » పోసాని కృష్ణ మురళి కేరాఫ్‌ జగదాంబ సెంటర్

పోసాని కృష్ణ మురళి కేరాఫ్‌ జగదాంబ సెంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రచయిత,దర్శకుడు పోసాని కృష్ణమురళి హీరోగా నటిస్తున్నమరో చిత్రం 'నిత్య పెళ్లికొడుకు' కి కేరాఫ్‌ జగదాంబ సెంటర్‌ అనేది ఉపశీర్షిక ని పెట్టారు. గౌరీపండిట్‌, అంజలి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అళహరి దర్శకుడు.. జి.వి.సుబ్బయ్య నిర్మాత.ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ "జీవితాంతం కలిసుండాల్సిన భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఆవేశం కాదు అవగాహన. అప్పుడే వారి బంధం నిత్య నూతనంగా ఉంటుంది. ఈ విషయాన్నే మా చిత్రంలో వినోదాత్మకంగా చెబుతున్నాం. పోసాని శైలికి సరిపోయే కథ ఇది" అన్నారు. రఘునాథరెడ్డి, ప్రసన్నకుమార్‌, పృథ్వీ, మల్లాది రాఘవ, శైలజ, కల్పన, నిర్మల, కిశోర్‌దాస్‌ ఇతర పాత్రధారులు. హీరో పోసాని మాట్లాడుతూ "కథ బాగుందనుకుని ఈ సినిమా చేస్తున్నా. నాకు తగ్గ బడ్జెట్‌తోటే ఈ సినిమా తయారవుతోంది" అన్నారు.పోసాని గతంలో మెంటల్ కృష్ణ, రాజా వారి చేపల చెరువు, జెంటిల్ మెన్ చిత్రాల చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu