For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సినిమాను రానివ్వరా? ఈ లంగా వేషాలు, వెధవ వేషాలెందుకు?.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వేడుకలో పోసాని

  |

  రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా హైదరాబాద్‌లో 'సింహ గర్జన' పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

  ఈ సందర్భంగా పోసారి కృష్ణ మురళి మాట్లాడుతూ... 'శివ' తర్వాత తన సినిమాకు రైటర్‌గా రమ్మని రామూగారు నిలిచారు. అపుడు మద్రాస్ యూనివర్శిటీలో పి.హెచ్.డి చేస్తున్నా. నా కోసం వెతకడానికి రామూగారి అసిస్టెంట్లకు రెండు రోజులు పట్టింది. ఓ మెస్‌లో నేను భోజనంచేస్తుండగా వారు వచ్చి రామూగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పగానే షాకయ్యాను. రామూగారు పిలిపించుకుని నా తర్వాతి చిత్రానికి నువ్వే రైటర్.. రాయాలి అని చెప్పగానే సార్ నాకు పరుచూరి బ్రదర్స్ దగ్గర మరింత అనుభవం కావాలి అని చెప్పాను. ఆయన ఈ విషయాన్ని ఈజీగా తీసుకుని నువ్వు ఎప్పుడు రైటర్ అవుదామన్నా నా వద్దకు రా అని భరోసా ఇచ్చారు... అని గుర్తు చేసుకున్నారు.

  ఒకే ఒక్క డైరెక్టర్ అతడే

  ఒకే ఒక్క డైరెక్టర్ అతడే

  ‘రామూ గారి గురించి మిగతా డైరెక్టర్లతో కంపేర్ చేయడం నాకు నచ్చని పని. ఒక మాట అయితే చెప్పగలను. భారత దేశంలో టోటల్ సినిమా మీద అవగాహన, ఫుల్ కమాండ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అది నేను స్పష్టంగా నమ్ముతాను. దగ్గరుండి చూశాను'' అని పోసాని వ్యాఖ్యానించారు.

  సినిమాను బయటకు రానివ్వరా? ఎందుకు ఈ వెధవ వేశాలు

  సినిమాను బయటకు రానివ్వరా? ఎందుకు ఈ వెధవ వేశాలు

  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను బయటకు రానివ్వరు... పలానా పార్టీ వారు సినిమాను ఆపేస్తారు. థియేటర్ వద్ద గొడవ చేస్తారు. సెన్సార్ వద్ద ఆపేస్తారు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ వెధవ వేశాలు వేయడం ఎందుకు? నువ్వు నిజాయితీగా ఉండొచ్చుగా... అని పోసాని చెప్పుకొచ్చారు.

  నీకే ఈ కష్టాలు ఎందుకంటే...

  నీకే ఈ కష్టాలు ఎందుకంటే...


  ఎవరైతే నిజాయితీగా ఉండరో, నీతిగా ఉండరో వారికే ఈ సమస్యలు వస్తాయి. వాజ్ పేయికి రాలేదు. అద్వానీకి రాలేదు. చాలా మంది నిజాయితీ పరులైన వారికి రాలేదు. పుచ్చలపల్లి సుందరయ్య రాజకీయాల్లో ఉన్నారు. వారికి ఈ కష్టాలు రాలేదు. ఇలాంటి సమస్యలు వెధవ వేశాలు వేసిన వారికి, అవినీతి పనులు చేసిన వారికి, వెన్నుపోటు పొడిచిన వారికి వస్తాయి. వారే బాధపడుతూ ఉంటారు.

  నువ్వు తప్పు చేశావు కాబట్టే సినిమా తీస్తున్నాడు

  నువ్వు తప్పు చేశావు కాబట్టే సినిమా తీస్తున్నాడు

  నువ్వు ఆ పనులు చేయకపోయి ఉంటే రామూ ఈ రోజు ఈ సినిమా తీయడు కదా. ఏ రామాయణమో, మహాభారతమో తీస్తేవాడు. నువ్వు వెధవ వేశాలు వేస్తే రామూ తీయడానికి రెడీగా ఉంటాడు. రామూ తప్పు చే