»   » సెలబ్రిటీల కోసం స్పెషల్ షో: 'రుద్రమదేవి' టాక్ ఎలా ఉంది?

సెలబ్రిటీల కోసం స్పెషల్ షో: 'రుద్రమదేవి' టాక్ ఎలా ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి' ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. రేపు(అక్టోబర్ 09) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. సినిమాపై రుద్రమదేవి టీం చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఇటు ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి ఉంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు గుణశేఖర్ నిన్న రాత్రి పలువురు సెలబ్రిటీలు, తన క్లోజ్ ఫ్రెండ్స్ కోసం స్పెషల్ షో వేసినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన అనంతరం వారు సినిమాపై పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. వారి నుండి ఫీడ్ బ్యాక్ బావుండటంతో దర్శకుడు గుణశేఖర్ సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు సమాచారం.


తెలుగు సినిమా చరిత్రలోనే ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం. తెలుగు జాతి గర్వించే విధంగా ఈ సినిమా ఉంటుందని గుణశేఖర్ ముందు నుండీ చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని చివరి 30 నిమిషాలు మేజర్ హైలెట్ అవుతుందని అంటున్నారు. అనుష్క పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి రోల్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుందని అంటన్నారు.


Positive Reports For Rudhramadevi From Celebrity Show

‘రుద్రమదేవి' చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతోంది. అక్టోబర్ 9న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో పలువురు సినీ లవర్స్ ఆన్ లైన్లో టికెట్లను హాట్ కేకుల్లా కొనేసారు. ఆన్ లైన్ అమ్మకాలతో దాదాపు అన్ని థియేటర్లు వీకెండ్ వరకు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ఆశిస్తున్నారు.


ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ సినిమాలో హైలెట్ కాబోతున్నాడు. చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Gunasekhar's dream project, Rudhramadevi is finally hitting screens tomorrow after its share of debacles and delays. The team has been showcasing great confidence on the output during promotions, though the trailers and songs looked ordinary. However, while the release is just hours away, the film has been getting great reviews from the industry insiders. According to the reports, Gunasekhar screened a special show for few of his close friends from the industry, last night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu