»   » తల్లినయ్యాక....నా అందం దెబ్బతింది: జెనీలియా

తల్లినయ్యాక....నా అందం దెబ్బతింది: జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తార జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాకుల పూర్తిగా దూరమైంది. ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. తన జీవితం ఎంతో సంతోషంగా ఉన్నా... తల్లినయ్యాక తన అందం మొత్తం దెబ్బతింది అంటోంది జెనీలియా.

చాలా కాలంగా తన మొహాన్ని అద్దంలో చూసుకోవడం మానేసానని జెనీలియా చెబుతోంది. నా స్కిన్ చాలా డల్ అయింది. ప్యాచీగా అయిందన్న ఆమె కోల్పోయిన తన అందాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ఓలే కంపెనీ తయారు చేసిన స్కిన్ క్రీమ్ వాడుతున్నట్లు ఆమె వెల్లడించారు.

Post delivery, my skin became dull and patchy: Genelia

ప్రెగ్నెన్సీ తర్వాత జెనీలియా తొలిసారిగా ఓలే కంపెనీ వారి టీవీ కమర్షియల్ యాడ్లో కనిపించబోతున్నారు. ఇందులో ఆమె కల్కి కొచ్లిన్‌తో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నారు. టీవీ ప్రకటనల ద్వారా మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన జెనీలియా త్వరలోనే మళ్లీ సినిమాల వైపు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ దంపతులకు నవంబర్ 25, 2014న రియాన్ జన్మించాడు. తమ ముద్దుల కుమారుడికి ‘రియాన్' అనే పేరు పెట్టడంపై పలువురు ఆశ్చర్య పోయారు. వాస్తవానికి ఆ పేరు అనుకున్నపుడు దాని మీనింగ్ కూడా రితేష్, జెనీలియా దంపతులకు తెలియదు. కొడుకు పేర్లు పెట్టేందుకు వెతుకుతుంటే ఆన్ లైన్లో ‘రియాన్' అనే పేరు కనిపించిందట. తర్వాత దాని మీనింగ్ కోసం ప్రయత్నిస్తే... ‘రియాన్' అనే లిటిల్ కింగ్, రూలర్ అనే మీనింగ్ వస్తుందని తెలిసిందట.

English summary
Bollywood actress Genelia D'Souza, who has maintained her distance from the camera after her marriage and motherhood, will be walking into the small screen with a TV commercial of a skincare range Olay Total Effects.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu