For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జై లవకుశ ఎందుకు చూడాలి.. చూడకూడదు.. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్

  By Rajababu
  |
  Jai Lava Kusa : Why Should We Watch, Check it Out : జై లవకుశ ఎందుకు చూడాలి.. చూడకూడదు..

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జై లవకుశ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. తొలిరోజున వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఎన్టీఆర్‌ ఖాతాలో మరో హిట్ పడినట్టే కనిపిస్తున్నది. ఈ చిత్రంపై కొంత డివైడ్ టాక్ కూడా వినిపిస్తున్నది ఈ చిత్రంలో కథాపరంగా కొన్ని లోపాలు, కథనం పరంగా కొన్ని అభ్యంతరాలను సంప్రదాయ సినీ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

  ఈ సినిమా ఎందుకు చూడాలి? ఎందుకు చూడకూడదు అనే విషయాలపై ప్రస్తుతం మీడియాలో చర్చ జరుగుతున్నది. జై లవకుశ చిత్రం ఎందుకు ప్రేక్షకులను ఆకట్టుకొన్నది? ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నది అనే అంశాలపై ఫిల్మీబీట్ సవివరమైన విశ్లేషణను అందించేందుకు ప్రయత్నిస్తున్నది.

  జై పాత్రలో ఎన్టీఆర్

  జై పాత్రలో ఎన్టీఆర్

  జై లవకుశ చిత్రానికి బలం జై పాత్ర. నెగిటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేశాడు. సినిమాను ఎన్టీఆర్ కేవలం జై పాత్రతోనే మరోస్థాయికి తీసుకెళ్లాడు. అందుకే ప్రేక్షకులు తారక్ నటను ఆస్వాదిస్తున్నారు.

  రెండు నాటకం ఎపిసోడ్స్

  రెండు నాటకం ఎపిసోడ్స్

  జై లవకుశ చిత్రం మెజార్టీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెండు నాటకం ఎపిసోడ్స్. సినిమా ఆరంభంలో బాల్యంలో ముగ్గురు అన్నదమ్ములు ప్రదర్శించిన నాటకం కథలోకి తీసుకెళ్లడానికి భలేగా ఉపయోగపడింది. అలాగే సినిమా చివరి అరగంటకు ముందు జై లవ, కుశలు ఆడిన నాటకం సినిమాకు ప్రాణంగా మారింది. రెండోభాగంలో వచ్చే ఎపిసోడ్ కనుక ఆకట్టుకోలేకపోతే జై లవకుశ టాలీవుడ్‌లో డిజాస్టర్‌గా నిలిచేది.

  లవ, కుశ పాత్రలు

  లవ, కుశ పాత్రలు

  ఇక వినోదం కోసం లవ, కుశ పాత్రలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. కుశ చెప్పే మాస్ డైలాగ్స్ కామెడీని భర్తీ చేశాయి. అదనంగా కామెడీ ట్రాక్ లేకుండా ఎన్టీఆర్ వినోదాన్ని పంచడంతో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా అయిపోయింది. ఇవన్నీ సినిమాకు సానుకూల అంశాలుగా మారాయి.

  ముగ్గురు అన్నదమ్ములు విడిపోవడం

  ముగ్గురు అన్నదమ్ములు విడిపోవడం

  ఇక చిన్నతనంలో ముగ్గురు అన్నదమ్ములైన జై, లవ, కుశ అనే పాత్రలు విడిపోవడం అనే పాయింట్‌ను సరియైన విధానంలో తెరకెక్కించలేదు అనే విమర్శకుల పాయింట్. నాటక క్షేత్రంలో అగ్ని ప్రమాదం సంభవించి కుశ పోలీస్ స్టేషన్‌లో ఎగిరిపడటమేమిటి? పోలీస్ స్టేషన్ కాలిపోవడం ఏమిటి? వాడిని పోలీసులు బాల నేరస్థుల ఆశ్రమం (బోస్టన్) స్కూల్ చదివించడమేమిటి? బోస్టన్ స్కూల్‌లో చదివితే దొంగలు అవుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

  ముందు వెనుకా ఆలోచించకుండా

  ముందు వెనుకా ఆలోచించకుండా

  ఎన్నో పరీక్షలను అధిగమిస్తే కానీ బ్యాంకులో ఉద్యోగంలో సంపాదించలేం. అయితే ఓ అమాయక బ్యాంక్ మేనేజర్ లవ ముందు వెనుకా ఆలోచించకుండా చెరువుకు రుణం ఇవ్వడమేమిటీ? తాగునీటి కోసం బ్యాంకులు రుణాలు ఇస్తాయా? అనే పాయింట్‌ను లేవనెత్తుతున్నారు.

  తేడా తెలియదా

  తేడా తెలియదా

  అందరిని బురిడీ కొట్టిస్తూ దొంగతనాలు చేసే కుశ అమెరికాకు వెళ్లి స్థిరపడాలనుకొంటాడు. మోస్తారు తెలివి తేటలు ఉన్న అమెరికాకు వెళ్లే వ్యక్తికి గ్రీన్ కార్డుకు, ఆధార్ కార్డుకు తేడా తెలియదా అని కొందరు అంటున్నారు. ఇలాంటివి కథాపరమైన లోపాలని చెప్తున్నారు.

  నైతిక విలువలను

  నైతిక విలువలను

  రావణ్ నీచమైన వాడు. క్రూరమైన వ్యక్తిత్వం కలవాడు. ఓ అమ్మాయి (నివేదా)ని చూసి పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. అందుకోసం తనమీద ప్రేమ కలిగించే విధంగా తన పోలికలు ఉన్న తమ్ముడిని నాటకం ఆడాలిని ఆదేశిస్తాడు. ప్రేమలోకి దింపడమంటే ఆ అమ్మాయితో రొమాన్స్ చేయాల్సిందే. అంటే వదిన వరస అయ్యే అమ్మాయితో మరిది ప్రేమ నాటకం ఆడటం తప్పు అని, అది నైతిక విలువలను దెబ్బ తీయడమే అంటున్నారు. సినిమాలో ఓ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ అని పేర్కొంటున్నారు.

  లవను కూడా మరణంలో

  లవను కూడా మరణంలో

  రావణ్ తమను చంపాలనుకొంటున్నాడు అనే విషయం కుశకు తెలుసు. తెలిసి కూడా బాంబులు ఫిక్స్ చేసిన వాహనంలో లవను ఎక్కించుకొని వెళ్లాడు. అన్నయ్య కోసం త్యాగానికి సిద్ధపడిన కుశ.. లవను కూడా మరణంలో భాగం చేయాలనుకోవడం కథాపరంగా తప్పు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూస్తూ చూస్తూ.. అదీ కారణం లేకుండా ఒకరిని చంపాలని ఎవరు అనుకోరు అని పేర్కొంటున్నారు.

  సానుకూల రెస్పాన్స్

  సానుకూల రెస్పాన్స్

  ఇలా జై లవకుశపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ ప్రేక్షకుల నుంచి సానుకూల రెస్పాన్స్ వస్తున్నట్టు సమాచారం. తొలి రోజు కలెక్షన్లు ఎన్టీఆర్ స్టామినాను తెలియజెప్పిందనే మాట ట్రేడ్ విశ్లేషకుల నుంచి వస్తున్నది. ఏపీ, తెలంగాణలోనే ఈ చిత్రం రూ.21 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.

  English summary
  Young Tiger Junior NTR's Jai Lava Kusa is releasing between huge expectations. Lead heroines are Raashi Khanna and Niveda Thomas. This movie which produced by NTR Arts banner. This movie got mixed responses from Audience and film critics from all over the globe.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X