రోబో-2... కోసం అక్షయ్ కుమార్ అంత పని చేసాడా?
హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘రోబో' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘2.0' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తొలుత ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తో విలన్ రోల్ చేయించాలనుకున్నారు. చివరకు ఆ స్థానంలో అక్షయ్ కుమార్‌ను ఫిక్స్ చేసారు.
దర్శకుడు శంకర్ ఈ విషయమై అక్షయ్ కుమార్‌ను సంప్రదించగానే వెంటనే ఒకే చెప్పేసారట. అప్పటికే తాను విపుల్ షా దర్శకత్వంలో ‘నమస్తే ఇంగ్లండ్' సినిమా కమిట్ అయి 4 నెలల డేట్స్ కూడా కేటాయించినప్పటికీ ‘2.0' సినిమా కోసం.... ‘నమస్తే ఇంగ్లండ్' చిత్రం షూటింగును వాయిదా వేసుకున్నాడట అక్షయ్ కుమార్.

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కే ఈ చిత్రంగా ‘రోబో 2.0' ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోందని నిర్మాత లైకా ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. ఇది ఇండియన్ సినిమాలోనే హై బడ్జెట్ ఇది. 2017 సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
3డి ఫార్మాట్‌లో తీయనున్న ఈసినిమాని ఇంటర్నేషనల్‌గా రిలీజ్ చేయటానికి ప్లాన్‌చేశారు. సౌత్ నుంచి ఇంటర్నేషనల్ వరకూ ఓ సినిమాని ఒకే టైటిల్‌తో ప్రమోట్ చేయటానికి శంకర్ ఈ సినిమా టైటిల్‌ని 2.0గా మార్చినట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











