మనోజ్ ‘పోటుగాడు’ ఆడియో రిలీజ్ డేట్
హైదరాబాద్: రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పోటుగాడు' . పవన్ బడియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలలోనే ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 25న ఆడియో విడుదల చేసేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కన్నడలో కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు' గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
'పోటుగాడు' చిత్రంలో మంచు మనోజ్‌తో కలిసి ఓ పాటను పాడారు శింబు. ఇప్పటికే ఈ సాంగు రికార్డింగ్ కూడా పూర్తయింది. పోటుగాడు చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పని చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే.
మంచు మనోజ్ చిత్రం గురించి చెప్తూ.. అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి రెండింటికీ సరిపోయే పదం 'పోటుగాడు'. నా శారీరకభాషకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. టైటిల్‌కి తగ్గట్టే ఇందులో తన పాత్ర కూడా ఉంటుందని మనోజ్ అంటున్నారు. చక్రి, అచ్చు ద్వయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లగడపాటి శ్రీధర్ నిర్మాత.


Click it and Unblock the Notifications












