twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనోజ్ 'పోటుగాడు' ఆడియో పంక్షన్ (ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మంచు మనోజ్ నటించిన 'పోటుగాడు' సినిమా ఆడియో వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్ ఏకర్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాసరి పై విధంగా మాట్లాడారు. లగడపాటి శ్రీధర్, శిరీష నిర్మించిన సినిమా 'పోటుగాడు'. పవన్ వడయార్ దర్శకత్వం వహించారు. సాక్షి చౌదరి, సిమ్రన్, రేచల్, అనుప్రియ నాయికలు. అచ్చు సంగీతాన్ని అందించారు.

    "మనోజ్‌ను చిన్నప్పటి నుంచి భుజాన వేసుకుని పెంచాను. తను పరిశ్రమలోని అన్ని శాఖల్లోనూ ప్రతిభను చూపిస్తున్నాడు. దాసరి నారాయణరావు చేసేవన్నీ అతనూ చేస్తాడు. 'పోటుగాడు' పెద్ద విజయం సాధించాలి'' అని దాసరి నారాయణరావు అభిలషించారు.

    ఈ సినిమా తొలి సీడీని మంచు మోహన్‌బాబు ఆవిష్కరించారు కీరవాణి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కీరవాణి, పీవీపీ, జయసుధ, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, శ్రీవాస్, కోన వెంకట్, గోపీమోహన్, బీవీయస్ రవి, నాగచైతన్య, వరుణ్ సందేశ్, అల్లరి నరేష్, శర్వానంద్, నాని, సునీల్, సందీప్‌కిషన్, నిఖిల్, వెన్నెలకిషోర్, మధుశాలిని, ఛార్మి, నికిత, శ్రీవాస్, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాటలు ఆదిత్య ద్వారా విడుదలయ్యాయి.

    మిగతా విశేషాలు..స్లైడ్ షోలో...

    ఘనంగా విడుదల..

    ఘనంగా విడుదల..

    మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్‌ హీరో గా నటించిన చిత్రం 'పోటుగాడు'. సిమ్రాన్‌కౌర్‌ ముండి, సాక్షి చౌదరి, రాచెల్‌ వెయిస్‌, అను ప్రియ గొయెంకా నాయికలు. పవన్‌ వడయార్‌ దర్శకుడు. లగడపాటి శిరీష, శ్రీధర్‌ నిర్మాతలు. అచ్చు స్వరాలందించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని మోహన్‌బాబు ఆవిష్కరించారు. కీరవాణి స్వీకరించారు.

    హ్యాపీ..హ్యాపీగా...

    హ్యాపీ..హ్యాపీగా...

    ఈ పంక్షన్ చాలా సరదాగా ఆద్యంతం సరదాగాగా జరిగింది. ఖచ్చింతంగా హిట్ కొడుతున్నామనే ఉత్సాహం మంచు మనోజ్ లో కనిపించింది. మోహన్ బాబు సైతం చాలా ఉషారుగా ఈ పంక్షన్ లో కనిపించి అందరినీ పలరించారు.

    మోహన్ బాబు మాట్లాడుతూ...

    మోహన్ బాబు మాట్లాడుతూ...

    ''నా దృష్టిలో ప్రేక్షకులే ప్రత్యక్ష దైవాలు. వారి ఆశీస్సులు ఉన్నంత కాలం కళాకారులు క్షేమంగా వందేళ్లు బతుకుతార''న్నారు ప్రముఖ నటులు మోహన్‌బాబుఅనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ ''మనోజ్‌తో ఈ సినిమా తీయాలని సంకల్పించిన దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు. కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రమిది. దర్శకుడు పవన్‌ కన్నడ నుంచి వచ్చి ఇక్కడ సినిమా తీశారు. మనోజ్‌ కెరీర్‌లో ఇదో అద్భుతమైన చిత్రమవుతుంది. ఏ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో ఎవరం చెప్పలేం. కానీ కష్టే ఫలి అన్న విషయం మాత్రం మరిచిపోకూడదు. మనోజ్‌ రిస్క్‌లు చేస్తాడని చెప్తుంటారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అనవసరమైన రిస్క్‌లు వద్దని వారిస్తుంటాను. పనిపై శ్రద్ధ పెడితే చాలని చెబుతుంటాను. అచ్చు మంచి సంగీతమందించాడు. తను కీరవాణి కంటే ఉన్నత స్థానానిని చేరాలని కోరుకుంటున్నా'' అన్నారు.

    దాసరి నారాయణరావు మాట్లాడుతూ...

    దాసరి నారాయణరావు మాట్లాడుతూ...

    ''మనోజ్‌ని చూస్తే ఒక్కోసారి నవ్వొస్తుంది.. ఇంకోసారి ఆశ్చర్యమేస్తుంది. చిన్నప్పుడు తనను భుజాలపైనే వేసుకొని తిరిగాను. వీడు అల్లరి కుర్రాడు అవుతాడు అనుకునేవాడిని. చిత్ర పరిశ్రమను ఏం చేస్తాడో అనుకొనేవాణ్ని. కానీ రచయితగా, ఫైట్‌ మాస్టర్‌గా, గాయకుడిగా, నిర్మాతగా, నటుడిగా.. ఇలా నేనేమేం చేయగలనో అన్నీ చేస్తున్నాడు. క్రమశిక్షణ విషయంలో మోహన్‌బాబు ఎంత పక్కాగా ఉంటాడో వారి బిడ్డలు కూడా అలాగే ఉంటారు. సినిమా కోసం మనోజ్‌ పడే తపన అంతా ఇంతా కాదు. తనకు ఈ చిత్రం మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నాను. నిర్మాత లగడపాటి శ్రీధర్‌లో మంచి అభిరుచి ఉంది. ప్రత్యేకమైన సినిమాలు తీయాలని తపిస్తుంటాడు. ఈ సినిమా వినోదాత్మకంగా సాగే వాణిజ్య చిత్రమని చెప్పాడు. ఇప్పటి ప్రేక్షకులకు కావాల్సింది అలాంటి సినిమాలే'' అన్నారు.

    ఛార్మి విత్ లక్ష్మి

    ఛార్మి విత్ లక్ష్మి

    ఈ పంక్షన్ లో ఛార్మి ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. ఛార్మి, మంచు లక్ష్మి ప్రసన్న కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఇద్దరూ ఉషారుగా తిరుగుతూ అక్కడ అతిధులను పలకిరించారు. మొదటి నుంచి ఛార్మికి ..మంచు ఫ్యామిలీతో మంచి అనుభంధం ఉంది.

    పెద్దలంతా..

    పెద్దలంతా..

    మంచు మనోజ్ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటూ ఇండస్ట్రీలోని మంచు ఫ్యామిలీ.. శ్రేయాభిలాషులంతా ఈ పంక్షన్ కి తరలి వచ్చారు. వారందరినీ మోహన్ బాబు తన దైన శైలిలో పలకరించి రిసీవ్ చేసుకున్నారు.

    ఛార్మి మాట్లాడుతూ..

    ఛార్మి మాట్లాడుతూ..

    ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు. తనకు మంచు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. మనోజ్ చాలా మంచి నటుడని ఆమె అన్నారు.

    గురు,శిష్యులు...

    గురు,శిష్యులు...

    మోహన్ బాబు తన గురువు దాసరి అంటే దైవ సమానంగా భావిస్తారు. అలాగే దాసరి సైతం...మోహన్ బాబుని తన ప్రియతమ శిష్యుడుగా చెప్తూంటారు. వీరిద్దరు కలిస్తే కబుర్లే కబుర్లు. మధ్యలో ఛార్మి కూడా ఇలా వింటూ...

    అల్లరి నరేష్...

    అల్లరి నరేష్...

    మంచు మనోజ్ కి తన ప్రెండ్ సర్కిల్స్ లో అల్లరి నరేష్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అలాగే అల్లరి నరేష్ సైతం మనోజ్ ప్రతీ పంక్షన్ కీ హాజరౌతూంటారు. దానికి తోడు ఈ చిత్రం కామెడీ కూడా కావటంతో ...ఈ కామిడీ హీరో స్టేజీపై ఓ రేంజిలో రెచ్చిపోయారు.

    కీరవాణి

    కీరవాణి

    కీరవాణి మాట్లాడుతూ ''మోహన్‌బాబు కుటుంబంలో నేనొక సభ్యుణ్ని. అచ్చు మా కుటుంబంలోని సభ్యుడు. పాటలు విన్నాను చాలా బాగున్నాయి. ఈ పోటుగాడు... పాటగాడు కలసి బాక్సాఫీస్‌ని ఓ పోటు పొడవాలని కోరుకుంటున్నా'' అన్నారు.

    నాగచైతన్య...

    నాగచైతన్య...

    మంచు మనోజ్ మంచి నటుడు అని... ఈ చిత్రం తప్పక ఘన విజయం సాధించి ...మనోజ్ కు బ్రేక్ ఇస్తుందని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఈ చిత్రం విజయం పై ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు.

    లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ..

    లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ..

    ''మనోజ్‌ ప్రతిభావంతుడు. పవన్‌ వడయార్‌ ఓ మంచి సినిమాని తీశాడు. శ్రీధర్‌ రాసిన మాటలు చాలా బాగున్నాయి'' అన్నారు. ఈ చిత్రం తన బ్యానర్ కి మించి పేరు తెస్తుందని అన్నారు.

    మంచు లక్ష్మి మాట్లాడుతూ..

    మంచు లక్ష్మి మాట్లాడుతూ..

    తన సోదరుడు..మంచు మనోజ్ చేసిన పోటు గాడు చిత్రం మంచి విజయం సాధిస్తుందని, తాను సినిమా చూసానని చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రం తో తన సోదరుడుకి మంచి బ్రేక్ వస్తుందని ఆమె అన్నారు.

    మనోజ్‌ మాట్లాడుతూ...

    మనోజ్‌ మాట్లాడుతూ...

    ''నాతో పోటుగాడు సినిమాని తీసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. కెమెరామెన్‌ శ్రీకాంత్‌ చాలా బాగా చిత్రీకరించాడు. హాలీవుడ్‌ సినిమాలా కనిపిస్తాయి సన్నివేశాలు. అచ్చు సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. 'ప్రేమ పేరుతో ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు. ఎవరికైనా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే.. సైన్యంలో చేరండి' అని చెప్పే చిత్రమిది'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ...

    దర్శకుడు మాట్లాడుతూ...

    ''కన్నడలో నేను తీసిన 'గోవిందాయ నమః'కంటె 'పోటుగాడు' బాగా వచ్చింది. మనోజ్‌ శైలికి తగ్గ కథ ఇది. నిర్మాత సహకారం మరచిపోలేనిది'' అన్నారు పవన్‌ వడియార్‌. ఈ కార్యక్రమంలో విష్ణు, నాగచైతన్య, అల్లరి నరేష్‌, సునీల్‌, నాని, శర్వానంద్‌, మధుశాలిని, జి.నాగేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌ వి.పొట్లూరి, జయసుధ, లక్ష్మీ ప్రసన్న, చార్మి, వరుణ్‌ సందేశ్‌, తనీష్‌, సందీప్‌కిషన్‌, నిఖిల్‌, కోన వెంకట్‌, గోపీమోహన్‌, బీవీఎస్‌ రవి, శ్రీవాస్‌, వెన్నెల కిషోర్‌, మంచు నిర్మల, వెరోనికా తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Manchu Manoj starrer Potugadu movie audio was released on Sunday night. First CD was given to the famous Music Director Keeravani by Mohan Babu. The music was scored for the movie by Achu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X