»   » సూర్యుడు...చంద్రుడు అంటూ మంచు మనోజ్

సూర్యుడు...చంద్రుడు అంటూ మంచు మనోజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : మంచు మనోజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'పోటుగాడు'. సాక్షి చౌదరి, సిమ్రన్‌ కౌర్‌ ముండి, రాచెల్‌ వెయిస్‌, అనుప్రియ గొయాంక హీరోయిన్స్ . పవన్‌ వడెయార్‌ దర్శకుడు. లగడపాటి శ్రీధర్‌, శిరీష నిర్మాతలు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామి హైదరాబాద్‌లో విడుదల చేశారు.

''సూర్యుడు ఉదయం కనిపిస్తాడు.. చంద్రుడు రాత్రి కనిపిస్తాడు.. కానీ ఈ గోవిందు ఎప్పుడూ కనిపిస్తాడు'' అనే డైలాగుతో 30 సెకండ్ల ఈ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది.

లింగు స్వామి మాట్లాడుతూ ''మనోజ్‌ నటన చాలా హుషారుగా ఉంటుందని అందరూ చెప్తుంటే విన్నాను. ఇప్పుడు ఈ ప్రచార చిత్రంలో చూశాను. సినిమా కూడా ఇదే తరహాలో ఉండబోతుంది'' అన్నారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ...''కన్నడంలో విజయవంతమైన 'గోవిందాయ నమః' సినిమాకి ఇది రీమేక్‌. పవన్‌ వడెయార్‌ దీన్ని బాగా తెరకెక్కించారు. అచ్చు నేపథ్య సంగీతం బాగా కుదిరింది. చక్రి ఓ గీతాన్ని అందించారు. మా చిత్ర బృందం చాలా కష్టపడి.. ఇష్టపడి తీసిన చిత్రమిది. వచ్చే వారంలో పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ''ఇన్నాళ్లు మీరు చూసిన మనోజ్‌ వేరు.. ఇప్పుడు ఈ చిత్రంలో చూడబోయే మనోజ్‌ వేరు. సినిమాలో ప్రతి 20 సెకన్లకు ఒక నవ్వుల బాంబు పేలుతుంది''అన్నారు .

నిర్మాతల్లో ఒకరైన శ్రీధర్‌ మాట్లాడుతూ ''మోహన్‌బాబుగారి సినిమా అంటే ఆలస్యమనేది ఉండదు. సమయానికి పూర్తయి.. మంచి ఫలితం సాధిస్తుందని అందరూ చెప్పేవారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచి వచ్చిన నటులు సైతం దీన్ని ఆచరిస్తున్నారు. ఇందులో మనోజ్‌ పాత్రలోని పార్శ్వాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది'' అన్నారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, మంచు లక్ష్మి, శ్రీకాంత్‌, మారుతి, సుదర్శన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జె.బి తదితరులు పాల్గొన్నారు.

English summary
Manchu Manoj's Potugadu 40 sec teaser is released. It sensed a laugh riot with high range entertaining performance fro Manchu Manoj. The film unit launched the teaser at Prasad Labs. Manoj will be seen dancing with four fresh heroines Anu Priya, Sakshi Chowdary, Rachel and Simran.Pavan is directing the movie while Chakri & Achu provided musical scores. A special number of the album is crooned by Manchu Manoj and Tamil Hero Simbu. Pawan Wadeyar is the director of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu