మంచు మనోజ్ ‘పోటుగాడు’ టీజర్ (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్ : మంచు మనోజ్ హీరోగా పవన్ వడెయార్ దర్శకత్వంలో 'పోటుగాడు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఈ రోజు విడుదలైంది. మంచు మనోజ్ మరోసారి తన ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్‌తో అలరించబోతున్నాడని ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.

ఈ చిత్రాన్ని నిర్మాత లగడపాటి శ్రీధర్ రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. పోటుగాడు చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పని చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే.

ఇక ఈ చిత్రం ఓ కన్నడ రీమేక్ . కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'..... చిత్రం తెలుగులో 'పోటుగాడు' గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్‌ ఈ చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మనోజ్ చిత్రం గురించి చెప్తూ.. అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి రెండింటికీ సరిపోయే పదం 'పోటుగాడు'. నా శారీరకభాషకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. టైటిల్‌కి తగ్గట్టే ఇందులో తన పాత్ర కూడా ఉంటుందన్నారు.

ఈ చిత్రాన్ని రంజాన్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 'పోటుగాడు' చిత్రంలో మంచు మనోజ్‌తో కలిసి ఓ పాటను పాడారు శింబు. ఇప్పటికే ఈ సాంగు రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X