»   » బాహుబలి ప్రభంజనాన్ని అడ్డుకొన్న ఓ సినిమా.. పవర్‌ఫుల్‌గా చుక్కలు.. నువ్వానేనా..

బాహుబలి ప్రభంజనాన్ని అడ్డుకొన్న ఓ సినిమా.. పవర్‌ఫుల్‌గా చుక్కలు.. నువ్వానేనా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి హవాకు అన్ని రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో బాహుబలి వేగానికి చాలా సినిమాలు కొట్టుకుపోతున్నాయి. కానీ బాహుబలి ప్రభంజనానికి ఎదురెడ్డి నిలిచిన ఓ చిత్రం ఉందంటే నమ్ముతారా. అలాంటి చిత్రం ఒకటి తమిళనాడులో బాహుబలికి దీటుగా కలెక్షన్లను సాధిస్తున్నది. ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే పవర్ పాండీ.

బాహుబలికి ధీటుగా నిలిచిన..

బాహుబలికి ధీటుగా నిలిచిన..

విలక్షణ నటుడు ధనుష్ తొలిసారి దర్శకత్వం వహించి నటించిన చిత్రం పవర్ పాండీ. ఈ చిత్రంలో రాజ్ కిరణ్, రేవతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని నమోదు చేసుకొన్నది. బాహుబలి2 రిలీజ్ వరకు భారీ కలెక్షన్లను సాధించింది. అయితే బాహుబలి తర్వాత పవర్ పాండీ ఖేల్ ఖతం అని అందరూ అనుకొన్నారు. కానీ బాహుబలికి ధీటుగా నిలిచి ఈ సినిమా తన పవర్ చాటింది.


90 శాతం అక్యుపెన్సీతో..

90 శాతం అక్యుపెన్సీతో..

బాహుబలి ఓ వైపు ప్రభంజనం కొనసాగిస్తుండగా పవర్ పాండీ 90 శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో దూసుకెళ్తున్నది. గత వారంతంలో భారీ కలెక్షన్లను సాధించిందని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. దాదాపు చెన్నైలో 41 షోలు స్క్రీనింగ్ అయినట్టు తాజా సమాచారం. ఓ మోస్తారు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ హిట్‌ను సాధించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొన్నది. విడులైన రోజు నుంచి భారీ కలెక్షన్లను సాధిస్తున్నది.


సీక్వెల్‌తో ..

సీక్వెల్‌తో ..

పవర్ పాండీ ఓ వైపు హిట్‌తో దూసుకెళ్తుండగా పవర్ పాండీ సీక్వెల్‌ గురించి ధనుష్ ఆలోచించడం గమనార్హం. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ... పవర్ పాండీకి సీక్వెల్ ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేను. కానీ పవర్ పాండీ2 మాత్రం తప్పకుండా తీస్తాను. కథ మదిలో తిరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా సాధిస్తున్న విజయంపై సంతోషంగా ఉన్నాను. స్క్రిప్టు రాయడంపై దృష్టిపెట్టాను. పవర్ పాండీ తన కెరీర్‌లో 13వ స్క్రిప్ట్ అని ధనుష్ పేర్కొన్నారు.


మోహన్ బాబు చేతికి పవర్ పాండీ..

మోహన్ బాబు చేతికి పవర్ పాండీ..

ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నటుడు మోహన్ బాబు దక్కించుకొన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ సూచన మేరకు మోహన్ బాబు ఈ చిత్రాన్ని తీసుకొన్నట్టు సమాచారం. తెలుగులో రీమేక్ చేసే ఈ సినిమాకు నిర్మాతగా మంచు విష్ణు వ్యవహరించనున్నారు.English summary
'Baahubali 2' mania. The film has taken a tremendous opening record in Chennai box office. However despite the 'Baahubali 2' storm, Dhanush's debut directorial 'Power Paandi' which has performed exceptionally well in the Chennai Box Office in its third weekend in chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu